Sriramanavami 2024: రామ రాజ్యం ఎలా ఉండేది.. రామ బాణం విశిష్టత తెలుసా..

హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర శుద్ధ నవమినాడు శ్రీరాముడి వివాహం జరిగిందని, ఆ రోజే ఆయన పట్టాభిషేకం జరిగిందని ప్రతీతి. అందుకే శ్రీరామ నవమిని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రామాణయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసినా.. ఆ మహాగాధను ఎన్నిసార్లు విన్నా.. మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంటుంది. సాక్షాత్తు శ్రీహరి.. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని అవతారంలో భూమిపై క్షత్రియ కులంలో అవతరించి.. రాజ్యపాలన చేశాడు.  రామ.. రావణ యుద్దంలో  రామ బాణానికి చాలా ప్రత్యేకత ఉందని పురాణాలు చెబుతున్నాయి.  రాముని పాలనలో రాజ్యం ఎలా ఉండేది.. రామబాణం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం, , , 

ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య.. మాట తప్పని వైనం, మడమ తిప్పని శౌర్యం.. ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన లక్షణాలు. వీటన్నింటీ ప్రతిరూపమే పరమపావన మూర్తి శీరామచంద్రమూర్తి. దేవుడిగా కాకుండా ఓ మనిషిగా ఆయనను చూస్తే అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటాడు. అంతటి మహాపురుషుడు ఈ భూమిపై తిరిగాడంటే ఆశ్చర్యమేస్తుంది. 

రామరాజ్యం ఎలా ఉండేదంటే..

సీతమ్మను అపహరించిన రావణుడిని యుద్ధంలో సంహరించిన పిమ్మట తిరిగి అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడవుతాడు శ్రీరాముడు. అనంతరం 11 వేల సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించడానికి నమ్ముతారు. సంపూర్ణ శాంతి, శ్రేయస్సు కోసం అయోధ్యను పరిపాలించాడు. తన రాజ్యంలో ఎవ్వరికీ కష్టాలనేవి ఉండేవి కాదట. దొంగతనం, కరవులు ఊసే లేదని చెబుతారు. తన పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ, సంతోషాలతో హాయిగా జీవించేవాడట. ఆయన పాలనలో వర్షాలు సరైన సమయంలో పడేవట. నెలలో మూడు సార్లు కురవడం వల్ల పంటలు బాగా పండి రాజ్యం సశ్యామలంగా ఉండేదట.  

శ్రీ రామ నవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఆ రోజే జరిగిందని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీరామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా రామ నామాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. 

పురాణాల ప్రకారం రాముడు త్రేతాయుగానికి చెందినవారు. దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం ఆయన జననం జరిగిందని కొంతమంది చెబుతారు. ఆ సమయంలో సూర్యుడు అత్యంత ప్రకాశంవతంగా కనిపించడాని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ రాముడు పితృవాక్యపరిపాలకుడు. తన తండ్రి మాటను జవదాటేవాడే కాదు. తండ్రిచ్చిన మాటకు కట్టుబడి సతీమేతంగా, సోదరుడి లక్ష్మణుడితో కలిసి 14 ఏళ్ల వనవాసం చేశాడు. రామ బాణానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఇది ఎంతో శక్తివంతమైంది. ఒక్కసారి సంధిస్తే అది రాజ్యంలోని మొత్తం సైన్యాన్ని సమూలంగా సంహరించగలదు.