బీర్ ​తాగేటప్పుడు ఏంతినాలో తెలుసా...

బీర్ అంటే యూత్‌కు చాలా ఇష్టం. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా లేదా బర్త్ డే పార్టీ అయినా సరే బీరు తాగుతుంటారు. అంతే కాకుండా స్నేహితులతో కలిసి కొంతమంది డైలీ ఒక బీర్ తాగడం తమ హాబీగా పెట్టుకుంటారు. అయితే ఈ బీర్ తాగే సమయంలో కొంత మంది మంచింగ్‌గా తీసుకుంటారు.అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను బీర్‌తో పాటు తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట.అందువలన బీర్‌తో పాటు తీసుకోకూడని, తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో వేడి నుంచి తప్పించుకోవడానికి వీలైనన్ని బీర్లు తాగేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వేసవి తాపానికి చల్లటి బీరే పరిష్కారమని చాలా మంది భావిస్తుంటారు. దీంతో వేసవి కాలంలో బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగిపోతుంటాయి. మండే ఎండ నుంచి బయట పడాలంటే చల్లని బీరు గొంతుతడిపితే భగభగమండే భానుడు కూడా తమను ఏం చేయలేడని మందుబాబులు వాదిస్తుంటారు. బీరు తాగడం వల్ల ఏమీ శరీరానికి చల్లదనం కలగదని మరికొందరు వాదిస్తున్నారు.

ALSO READ :- 2024 Tech layoffs: 89 శాతం ఐటీ ఉద్యోగుల్లో లేఆఫ్స్ భయం..అధ్యయనాల్లో వెల్లడి

చాలా మంది బీర్‌తో పాటు ఎగ్ ఆమ్లెట్, పకోడీ, బజ్జీలు, చికెన్ ఫ్రైడ్ పీసెస్, మటన్ కర్రీ, పండ్లు లాంటివి తీసుకుంటారు. అయితే మసాలా ఎక్కువగా ఉన్న చికెన్, మటన్ లాంటివి బీర్‌తో తీసుకోకూడదంట. దీని వలన యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్,ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయట.అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి వాటిని కూడా బీర్‌ తాగేటప్పుడు తీసుకోకూడదంట.ఇందులో అధికంగా సోడియం ఉంటుంది. అందువల్ల బీర్‌తో వీటిని తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది అంటున్నారు వైద్యులు. అందువల్ల ఎగ్ వైట్‌తో చేసిన పదార్థాలు, చేపలు, ఉడికించిన వేరుశెన, మొలకెత్తిన విత్తనాలు వంటికి బీరు తాగే సమయంలో మంచింగ్‌గా తీసుకోవాలని ఓ నివేదికలో పేర్కొన్నారు.