మనం నడుచుకుంటూ వెళుతుండగా రోడ్డుపై అనుకోకుండా డబ్బు దొరుకుతుంది. అందరికీ ఇలా జరగదు. ఎప్పుడో ఒకసారి ఇలా అవుతుంది. రోడ్డున పడిన డబ్బులు కనిపిస్తే, తీసుకోవచ్చా ... తీసుకోకూడదా... ? తీసుకుని ఖర్చు పెట్టుకోవచ్చా? ఇలా ఎన్నో ఆలోచనలు మనసులో మెదులుతాయి. అయితే రోడ్డుపై డబ్బులు దొరికితే ఎలా ఉంటుంది? ఆధ్యాత్మికంగా దీని గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
మనలో చాలా మందికి ఎక్కడికైనా వెళ్తున్న సమయంలో లేదా ఇంకేదైనా ప్రదేశంలో వెళ్తున్నప్పుడు సడెన్‌గా డబ్బులు దొరుకుతుంటాయి. అవి నాణేల రూపంలో లేదా కరెన్సీ నోట్ల రూపంలో ఉండొచ్చు. అయితే అలా దొరికిన డబ్బును ఖర్చు పెట్టొచ్చా లేదా అలాగే దాచుకోవాలా.. ఇంతకీ అలా దొరికిన డబ్బు వల్ల శుభం జరుగుతుందా లేదా అశుభం జరుగుతుందా అనే గందరగోళం చాలా మందికి తలెత్తుతుంది. ఇలాంటి సమయంలో కొందరు అలా దొరికిన డబ్బును పేదలకు ఇస్తారు లేదా ఏదైనా దేవాలయానికి విరాళంగా ఇస్తారు. ఈ సందర్భంగా రోడ్డుపై డబ్బు దొరికితే దేనికి సంకేతం అనే విషయాలను తెలుసుకుందాం. . .
మీరు ఏదో పని ఉండి, రోడ్డుపై వెళ్తూ ఉంటే, ఉన్నట్టుండి మీకు డబ్బు కనిపిస్తే, దాని అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా.. అసలు విషయం తెలిస్తే, మీరు చాలా ఆనందపడతారు. రోడ్డుపై మనీ కనిపిస్తే, కొంతమంది వెంటనే తీసి, అది ఎవరిదై ఉంటుందా అని చుట్టూ చూస్తారు. ఎవరైనా మనీ కోసం వెతుక్కుంటూ ఉంటే, వారికి ఆ డబ్బును ఇచ్చేస్తారు. అదే ఎవరూ లేకపోతే, ఆ మనీ వారే తీసుకుంటారు. నిజానికి ఇలా మనీ కనిపించడం ఓ సిగ్నల్ అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
హిందూ మతం ప్రకారం డబ్బును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై దొరికిన డబ్బును చూసీచూడనట్లు వ్యవహరించడం లక్ష్మీ తల్లికి అవమానంగా చెబుతున్నారు. అందుకే వీధిన పడిన డబ్బును అగౌరవపరచకూడదని అంటారు. మీకు రోడ్డుపై దొరికిన డబ్బును వీలైనంత వరకు సరైన వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నించాలి. . మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మీకు డబ్బు కనిపిస్తే, దానిని మీ కార్యాలయంలో ఉంచండి లేదా ఆలయానికి విరాళంగా ఇవ్వండి. కానీ ఆ డబ్బును స్వంత అవసరాలకు ఎప్పుడూ ఖర్చు చేయవద్దు. ఇంటికి వచ్చేటప్పుడు దొరికితే ఆ నాణాన్ని.. లేదా ఆ నోటును ఇంట్లో డబ్బులు భద్రపర్చే స్థలంలో దాచుకోండి.. దీని వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో, రోడ్డుపై పడిన డబ్బు లేదా నాణేలు కనిపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎవరికైనా రోడ్డు మీద పడి ఉన్న నాణేలు కంట పడి ఉంటే, మీకు పూర్వీకుల ఆశీర్వాదం లభించిందని అర్ధం. జ్యోతిష్య శాస్త్రంలో, రోడ్డుపై పడిన డబ్బు లేదా నాణేలు కనిపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎవరికైనా రోడ్డు మీద పడి ఉన్న నాణేలు కంట పడి ఉంటే, మీకు పూర్వీకుల ఆశీర్వాదం లభించిందని అర్ధం.
హిందూ మతం ప్రకారం మరొక సంకేతం ఏమిటంటే, మీరు రోడ్డుపై పడి ఉన్న నాణేలను కనిపిస్తే, మీరు చేసే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చైనాలో అయితే ఇలా రోడ్డుమీద దొరికిన డబ్బు లేదా నాణేలను లావాదేవీలకు కాకుండా అదృష్టాన్ని మార్చుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. దారిలో ఎక్కడైనా ఒక నాణెం పడి ఉంది.. అది మీకు కనిపిస్తే మీరు ప్రారంభించబోయే కొత్త పనిలో మీరు విజయం సాధిస్తారనే సంకేతం.హిందూ మతం ప్రకారం.. కొంత డబ్బు రోడ్డుపై పడి ఉంటే, దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వాలి. పొరపాటున కూడా వాటిని ఖర్చు చేయకూడదు. ఇలా చేయడం వలన మీకు ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతుంటే, ఆ సమయంలో మీకు దారిలో ఒక నాణెం లేదా నోటు దొరికితే, మీరు వెళ్ళే పనిలో మీరు విజయం సాధిస్తారని అర్థం.
సాధారణంగా జ్యోతిష్యం ప్రకారం, ఎవరైనా వీధిలో డబ్బును చూస్తే, అది చాలా మంచి సంకేతంగా పరిగణిస్తారు. ఎందుకంటే జ్యోతిష్యశాస్త్రంలో డబ్బును లక్ష్మీదేవికి మరో రూపంగా పరిగణిస్తారు. కాబట్టి ధనం లభించినప్పుడు లక్ష్మీ తల్లి అనుగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. తద్వారా మీ జీవితంలో ఆర్థిక సమస్యలు అతి త్వరలో పరిష్కారమవుతాయి.