అసలే ఎండాకాలం.. ఓ పక్క చెమట.. మరోపక్క చికాకుతో రోజూ రెండూ పూటలా స్నానం చేస్తుంటారు. అయితే కొంతమంది రాత్రిపూట స్నానం చేయడానికి భయపడుతుంటారు. రాత్రిసమయంలో స్నానం చేస్తే జలుబు.. తుమ్ములు..దగ్గు వస్తుందని చెబుతుంటారు. దీంతో కొంతమంది అలా చిరాకుగానే ముఖం.. కాళ్లు .. చేతులు కడుక్కొని పడుకుంటారు. అయినా శరీరం ఫ్రెష్ గా లేకపోతే నిద్రపట్టదనుకోండి.. అలాంటి వారికి వైద్య నిపుణుల సలహా మేరకు సాయంత్రం.. రాత్రి సమయాల్లో ఎప్పుడు స్నానం చేయాలో తెలుసుకుందా. . .
Also Read:కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి
ఎండాకాలం వచ్చిదంటే జనాలు రెండు పూటలా స్నానం చేస్తారు. కొంతమంది తలస్నానం చేస్తుంటారు. రాత్రిపూట ఎక్కువ సమయం తల స్నానం చేసినా తెల్లవారే సరికి జలుబు వచ్చే అవకాశాలుంటాయి. జలుబు సమస్య నుంచి తప్పించుకోవాలంటే చల్లని నీటితో గానీ, ఎక్కువ సమయం తలస్నానం చేయకూడదు. సమ్మర్ సీజన్ లో రాత్రి 7 గంటలలోపు చన్నీళ్లతో స్నానం చేయాలి. ఆ తరువాత బయట కొంచెం సేపు ప్రకృతి గాలి వీచే ప్రదేశంలో ఉండాలి. శరీరం పూర్తిగా తడి ఆరిన తరువాత పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. అందుకే పల్లెల్లో... ఆరు బయట మంచాలపై నిద్రిస్తుంటారు. 7 గంటలలోపు కుదరకపోతే 9 గంటల సమయంలో గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎక్కువ వేడి ఉండకూడదు. ఆ తరువాత శరీరం బాగా తుడుచుకోవాలి. స్నానం చేయకపోతే చికాకు.. చెమటతో అసలు నిద్రపట్టదు. అందుకే కచ్చితంగా స్నానం చేయాలి. అవకాశం ఉంటే ఆరు బయట పడకుంటే ఎంత హాయిగా నిద్రపడుతుందో వేరే చెప్పనక్కర లేదు. ఆరుబయట పడుకునే అవకాశం లేకపోతే ఇంట్లోకి గాలి వచ్చేలా... తలుపులు తీసి పడుకోవాలి. అయితే దోమల బారి నుండి రక్షించుకునేందుకు దోమ తెరల లాంటివి వాడాలి.
ముఖ్యంగా వేసవిలో చెమట కాయల నుంచి , చికాకు నుంచి స్నానం నిర్జీవంగా ఉన్న చర్మాన్ని, తేమగా మారుస్తుంది. శరీరం తేలికైన ఫీలింగ్ కలిగి మంచి నిద్ర పడుతుంది. రాత్రి స్నానం శరీరాన్ని చాలా తేలికగా చేస్తుంది. మంచి రిలీఫ్ పొందినట్టుగా ఉంటుంది. ఉదయం నుంచి ఎండ, వేడి, చెమటల కారణంగా కలిగిన ఒత్తిడి, చిరాకు ఒక్క స్నానంతో మటుమాయం అయిన ఫీలింగ్ ఉంటుంది. అయితే ఈ రాత్రి సమయంలో చేసే స్నానం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అసలు రాత్రి స్నానం ఆరోగ్యానికి మంచిది.. అలాగే రాత్రిపూట తల స్నానం చేయవచ్చా? ఇలా మనకు ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. అయితే రాత్రి భోజనం తర్వాత తలస్నానం చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక వ్యవస్థ బలమగా ఉంటే సులభంగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ సమయంపాటు శరీరం మీద ఉదయంనుంచి మురికి, దుమ్ము, ధూళి వంటివి చికాకు పెట్టిస్తుంటే చక్కని స్నానం చర్మ ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిదే. రాత్రిపూట స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా నిద్ర విషయంలో మంచి ఫలితం ఉంటుంది.
1. పడుకునే ముందు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచి రిలీఫ్... తర్వాత తీసుకునే విశ్రాంతి చక్కని నిద్ర పట్టేలా చేస్తుంది.
2. రోజుంతా శరీరం మీద పేరుకున్న మురికి చెమట కలిగించే చిరాకు నుంచి రిఫ్రెష్‌గా ఉంచుతుంది.
3. ఒత్తిడి నుంచి ఆందోళన నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
4. స్నానం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రతలో తగ్గుదల మెదడును ప్రశాంతంగా చేసి, మంచి నిద్రకు దారితీస్తుంది.
రాత్రిపూట స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రం కావడమే కాదు.. చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడేవారికి ఇది మంచిఫలితాలను ఇస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే మరీ చల్లగా ఉన్న నీటితో రాత్రి సమయాల్లో స్నానం చేయకపోవడం మంచిది. భోజనం తర్వాత స్నానం చేసేవారికి అజీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే సాధ్యమయినంత వరకు భోజనానికి ముందే స్నానం చేయండి.రాత్రిపూట ఎక్కువ సమయం తల స్నానం చేసినా తెల్లవారే సరికి జలుబు వచ్చే అవకాశాలుంటాయి. జలుబు సమస్య నుంచి తప్పించుకోవాలంటే చల్లని నీటితో గానీ, ఎక్కువ సమయం తలస్నానం చేయకూడదు. ముఖ్యంగా వేసవిలో చెమట కాయల నుంచి , చికాకు నుంచి స్నానం నిర్జీవంగా ఉన్న చర్మాన్ని, తేమగా మారుస్తుంది. శరీరం తేలికైన ఫీలింగ్ కలిగి మంచి నిద్ర పడుతుంది.