వయసు మీద పడుతున్న కొద్దీ.. శరీరం సహకరించదు. దాంతో ఇంటికే పరిమితం అవుతారు చాలా మంది. హార్వర్డ్ యూనివర్సిటీ ఎవల్యూషనరీ, బయోకెమికల్ డిపార్ట్మెంట్ వాళ్లు ఇదే విషయం గురించి రీసెర్చ్ చేశారు.
ఈ రీసెర్చ్ ప్రకారం.. వయసు పెరిగే కొద్దీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే శరీరాన్ని యాక్టివ్ ఉంచొచ్చని చెబుతున్నారు. శారీరక శ్రమ ఉంటే జీవితంలో హెల్త్ కు సంబంధించిన విషయాల్లో హాయిగా ఉండొచ్చు. వయసు పెరుగుతున్నా శరీరం కూడా చురుకుగా ఉంటుంది అంటున్నారు.
నలభై ఏండ్ల తర్వాత కూడా ఎక్సర్ సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ రోజూవారి జీవితంలో భాగం అయితే కార్డియోవాస్కులర్ డిసీజ్, టైప్ 2 డయాబెటిస్, కొన్ని క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక రోగాల నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
శరీరంలో ఫ్యాట్ తగ్గించి, కేలరీ లను బర్న్ చేయడంలో ఈ శ్రమ బాగా పని ఇతర శారీరక పనులు చేయడమే కారణం అని రీసెర్చ్ లో పాల్గొన్న కార్డియాలజిస్టులు చెబుతున్నారు. వయసు పెరిగినా కూడా శారీరక శ్రమ ఉంటే చిన్నచిన్న ఫ్రాక్చర్లు నయమవుతాయి. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. బీపీ మెరుగు పడుతుందనేది ఈ రీసెర్చ్ సారాంశం.