పేరంట్స్ కేర్ : పిల్లల ఎదుట మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. లేకపోతే వాళ్ల భవిష్యత్ నాశనం చేసినోళ్లు అవుతారు..

పిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న వయసునుంచే వారు అన్ని విషయాల్లో పెద్దవాళ్ళని అనుకరించడం మొదలు పెడతారు అందుకే వారి పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి

  • రీడింగ్, రైటింగ్, గేమ్స్ ఇలాంటి విషయా ల్లో సందేహాన్ని వెలిబుచ్చితే జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. అలాగే ముఖ్యమైన సబ్జెక్ట్స్ సైన్స్, మ్యాథ్స్ డౌట్స్ ఉంటే వెంటనే తీర్చాలి. ఒకవేళ అవి మీకు తెలియకపోతే వాటిని దాటేయొద్దు. తెలుసుకుని మరీ చెప్పాలి. లేదా స్కూల్ టీచర్ని అడిగి చె ప్పించుకోమనాలి.
  • ఫంక్షన్స్ , బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు అక్కడి పిల్లలకు మీ చిన్నారులను కూడా పరిచయం చేసి, వాళ్ళతో కలిసిపోయి ఆడుకునేలా చేయాలి.
  • తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేట ప్పుడు అసభ్య పదాలను వాడకూడదు. ఎందుకంటే ఆ మాటలనే పిల్లలు అనుకరిస్తారు. పొరపాటున వారు అలాంటి మాటలను మాట్లాడితే తప్పని సున్నితంగామందలించాలి.
  •  సోషల్ అవేర్​నెస్ కలిగించే విషయాల గురించి వారితో తరచుగా చర్చిస్తూ ఉండాలి. రకరకాల భాషల గురించి, రకరకాల ప్రాంతాల గురించి వివరిస్తూ ఉండాలి. ఇవన్నీ వాషింగ్టన్ యూనివర్సిటీ వారు పిల్లల మనస్తత్వాల గురించి అధ్యయనం చేసిన విషయాలలో తెలిసిన నిజాలు. అందుకే పిల్లల భవిష్యత్తు బాగుండాలి  అంటే తల్లిదండ్రులు ముందుగా మాట్లాడే విధానంలో జాగ్రత్తలు పాటించాలి.

–వెలుగు, లైఫ్​–