Summer Alert : ఎండాకాలంలో వడ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

ఎండాకాలంలో వడదెబ్బ ఎవరికైనా తగలొచ్చు. కాబట్టి ఎండ ఉన్నన్ని రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్లో ఆరోగ్యంగా ఉండొచ్చు. 

• ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు పోవద్దు. ఏవైనా పనులుంటే పొద్దున 11లోపు... సాయంత్రం నాలుగు తర్వాత పనులు ప్లాన్ చేసుకుంటే మంచిది. 
• ఒక వేళ అర్జెంట్ పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. గొడుగు లేదా టోపి పెట్టుకుని బయటకు పోవాలి.
• ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు...కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగాలి. కూల్డ్రింక్స్ తాగొద్దు.
• ఎండలో తిరిగినప్పుడు చెమటతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా బయటకు పోతాయి. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు ఉప్పు వేసిన నిమ్మరసం లాంటివి తాగాలి. 
• దాహం కావట్లేదని నీళ్లు తాగకుండా. ఉందొద్దు. ఇంట్లో ఉండేవాళ్లయితే రోజుకు రెండున్నర నుంచి మూడు. బయట తిరిగేవాళ్లు ఆరు లీటర్ల వరకు నీళ్లు తాగాలి. నీళ్లు తాగకుంటే శరీరం   డీహైడ్రేట్ అవుతుంది.
• ఎండాకాలంలో మసాలాలు ఉండే ఆహారం. తినొద్దు. నాన్వెజ్.. బిర్యానీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 
• డ్రగ్స్.. ఆల్కహాల్ .. స్మోకింగ్ చేసేవాళ్లకు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ.

ఎండకాలంలో ఇంక ఏమేం రిస్క్ లుంటయ్?

ఎండలో తిరగడం వల్ల ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాల వల్ల కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. అయితే.. ఫైనల్ గా ఎండాకాలంలో అన్నింటికంటే పెద్ద ప్రమాదం ఏందంటే.. వడదెబ్బే! కాబట్టి ఎండల్లో జాగ్రత్తగా ఉండాలి.