రాఖీ పండుగ 2024:  అక్కా.. చెల్లెళ్లకు ఇలాంటి గిప్ట్స్​ ఇవ్వొద్దు..

మన తెలుగు రాష్ట్రాల్లో మహిళలను మహాలక్ష్మీగా భావిస్తారు.  అలాంటి అక్కాచెల్లెళ్లు.. అన్నా తమ్ముళ్లకు రాఖీ కడతారు.  అప్పుడు సోదరీ మణులకు కొన్ని బహుమతులు ఇస్తుంటారు. కాని కొన్ని రకాల గిఫ్ట్స్​ ఇస్తే..  అశుభకరంగా పరిగణిస్తారని పండితులు చెబుతున్నారు. పొరపాటున మీరు ఇలాంటి బహుమతులిస్తే మీ సంబంధాలలో గ్యాప్ పెరిగే అవకాశం ఉందంటున్నారు.  ఎలాంటి గిఫ్ట్స్​ ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. . . 

హిందూ మత విశ్వాసాల ప్రకారం, నలుపు రంగును అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఈ రంగుపై శని దేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందుకే తమ సోదరి భవిష్యత్తు మేలు కోరుకునే సోదరులంతా నలుపు రంగులో ఉండే ఎలాంటి వస్తువులను రాఖీ పండుగ రోజున బహుమతిగా ఇవ్వకండి. ముఖ్యంగా బ్లాక్ కలర్ డ్రస్సులను అస్సలు ఇవ్వొద్దు.. ఇంకా  రాఖీ పండుగ వంటి పవిత్రమైన రోజున మీ తోబుట్టువులకు పాదరక్షలను బహుమతిగా ఇవ్వకూడదు. 

స్మార్ట్‌వాచ్ ఇవ్వకండి..

రాఖీ పండుగ వేళ చాలా మంది తమ సోదరీమణులకు సమయం విలువ తెలియాలని, అది ఉంటే తమను కలకాలం గుర్తు పెట్టుకుంటారని భావించి గడియారాలను బహుమతిగా ఇస్తుంటారు. అందులోనూ ప్రస్తుతం స్మార్ట్ వాచెస్ లో అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో చాలా మంది వీటిని ఇవ్వడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే శాస్త్రాల ప్రకారం, అలాంటి వాటిని ఇవ్వడం వల్ల మీ బంధంపై ప్రభావం పడుతుందట. కాబట్టి మీ సోదరీమణులకు వాచ్ లేదా స్మార్ట్ వాచెస్ వంటి వాటిని ఇవ్వకండి.

మిర్రర్‌తో ప్రతికూల ప్రభావం..

రాఖీ పండుగ సందర్భంగా మీ సోదరికి అద్దాన్ని ఎప్పటికీ బహుమతిగా ఇవ్వకూడదు. మీరు ఎవరికైనా అద్దాన్ని బహుమతిగా ఇచ్చినప్పుడు, వారు అందులో తమ ముఖాన్ని చూస్తారు. ఈ కారణంగా వాస్తు దోషం ఏర్పడుతుంది. దీంతో అద్దం బహుమతిగా ఇచ్చిన వ్యక్తి మనసులో ప్రతికూల భావోద్వేగాలు రావడం ప్రారంభమవుతాయని నమ్ముతారు. దీంతో లోపాలు పెరిగే అవకాశం ఉంది.

వీటిని ఇవ్వొద్దు..

వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఎవరికైనా రుమాలు లేదా కండువా బహుమతిగా ఇస్తే, ఏరి కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్టే. అంతేకాదు వారిపై అదనపు భారం కూడా పెరుగుతుంది. అందుకే రక్షా బంధన్ పండుగ వేళ రుమాలు లేదా కండువా వంటి వాటిని బహుమతిగా ఇవ్వకండి.

పాటించాల్సిన నియమాలు.

  •  రక్షా బంధన్ రోజున అన్నదమ్ములు అస్సలు గొడవ పడకూడదు.
  •  పౌర్ణమి రోజున భద్ర కాలంలో రాఖీ కట్టకూడదు.
  • పౌర్ణమి వేళ భద్ర కాలంలో ఎలాంటి శుభ కార్యాలను నిర్వహించరాదు.
  • ఈ పవిత్రమైన రోజున సోదరీమణులను ఏ విధంగాను బాధించొద్దు.
  • రాఖీ కట్టే వేళ తన ముఖం దక్షిణం వైపున అస్సలు ఉండకుండా చూసుకోవాలి.
  • మీ సోదరికి పదునైన వస్తువులు బహుమతులుగా ఇవ్వొద్దు.
  •  విరిగిన అక్షింతలు(బియ్యం) లేకుండా చూసుకోవాలి. నలుపు రంగును వాడకండి.