చిలకడదుంప.. స్వీట్ పొటాటో.. గడుసుగడ్డ దీనిని చాలా ఏరియాలో గంజి గడ్డలని అంటూ ఉంటారు.ఈ గంజి గడ్డలను చాలామంది సాధారణ పొటాటోలో తిన్నంత ఇష్టంగా వీటిని తినరు.అలాంటి వారు ఎన్నో పోషకాలు మిస్ అయినట్టే.. వీటిని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చెబుతున్నారు ఆహార నిపుణులు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా...
చిలకడ దుంపలో ఐరన్,ఫోలేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది.దీంతో అనీమియా సమస్య ఉండదు.రక్తహీనతతో బాధపడేవారు తమ డైట్లో చిలగడ దుంప ఉండేలా చూసుకోవాలి.మరీ ముఖ్యంగా ఎముకలు బలహీనంగా ఉండేవారు అంటే పిల్లలు మరియు వయసు మళ్లిన వారు చిలగడ దుంపను తమ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. చిలకడ దుంపలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల తొందరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది.దీనితో ఎక్కువ తినాలనే కోరిక తగ్గిపోతుంది.ఎవరైతే తొందరగా బరువు తగ్గాలని కోరుకుంటూ ఉంటారో,వారికి ఇది మంచి ఆహారం .. ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
చిలకడదుంపలో ఉన్న కెరటనాయిడ్స్ రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది.మధుమేహంతో బాధపడేవారు చిలగడదుంపను ఎలాంటి అనుమానం లేకుండా తినవచ్చు. ఇందులో ఉండే పోషకాలు మధుమేహం ఉన్న వారికి ఎన్నో విధాలుగా సహాయపడతాయి. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది.ఈ ప్రోటీన్ అధికంగా లభిస్తుంది . ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
ALSO READ :-విజయనగరంలో పట్టాలు తప్పిన ట్రైన్ పక్కకు ఒరిగిన రెండు బోగీలు
అంతే కాక ఇందులో ఉన్న విటమిన్ సి జుట్టు .. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హైబీపితో బాధపడేవారు చిలకడ దుంపను తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి పనితీరును మెరుగుపరచి... బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. కీళ్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చిలగడ దుంపను నీళ్లలోనే ఉడికించుకుని, ఆవిరితో ఊడికించి తింటారు.కాబట్టి ఇందులో ఆయిల్ వాడకం అవసరం ఉండదు కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా మేలు సమాకూరుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు కలిగిన చిలకడ దుంపను రోజువారి ఆహారంలో తప్పక చేర్చుకోండి.