Good Health:కొలస్ట్రాల్ నిర్వహణలో..పచ్చి వెల్లుల్లి ఎలా పని చేస్తుంది..ఎలా తినాలి.. ఎంత తినాలి..?

క్రమబద్ధంగా లేని లైఫ్ స్టైల్ తో అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. షుగర్ నుంచి అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు మన అస్తవ్యస్థం అయిన లైఫ్ స్టైల్ వల్లనే తీవ్రమవుతాయి.శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండెపోలు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు ముందుగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. కూరగాయలు, ఆయుర్వేద నివారణలను రోజూవారి ఆహారంలో చేర్చుకుంటే మంచిది. ఎన్నో ఆయుర్వేద గుణాలను కలిగి ఉన్న పచ్చి వెల్లుల్లిని మన దైనందిన జీవితంలో నిత్యం వాడుతుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

పచ్చి వెల్లుల్లి చాలా ఎఫెక్టివ్ రెమిడీ. ఇది చెడు కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గించి ట్రైగ్లిజరైడ్ లను పెంచుతుంది. హై బ్లడ్ ప్రెషర్ ను నియంత్రిస్తుంది. మీరు కావాలంటే మీ ఆహారంలో  వెల్లుల్లి మొత్తాన్ని పెంచుకున్నా ఆరోగ్యానికి మంచిదే.. వెల్లుల్లి చట్నీ, ఊరగాయల్లో ఈ వెల్లుల్లిని వాడుకోవచ్చు. 

చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి వెల్లుల్లిని ఎలా తినాలి 

అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగికి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లిని సులభంగా నమిలి తినవచ్చు. రుచి చేదుగా అనిపిస్తే.. ఆ తర్వాత కొంచెం నీరు త్రాగవచ్చు. ఇలా వెల్లుల్లి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వెల్లుల్లి కూడా రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది.

వెల్లుల్లి, తేనె తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

వెల్లుల్లి రుచి కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి పచ్చి వెల్లుల్లిని తినడానికి ఇబ్బంది పడే వారు తేనెతో కలిపి తినవచ్చు. ఇందుకోసం వెల్లుల్లి రెబ్బను తేనెలో ముంచి తినాలి. ఇది వెల్లుల్లి రుచిని తక్కువ చేదుగా చేస్తుంది మరియు పచ్చి వెల్లుల్లిని తింటే.. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.. దీంతోపాటు రక్తాన్ని పలుచగా చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. కావాలంటే వెల్లుల్లిని తరిగి అందులో తేనె కలిపి వారం రోజుల పాటు బాక్సులో నిల్వ చేసుకోవచ్చు. మీరు వారమంతా సులభంగా తినవచ్చు.