కొత్త కోడళ్లు నెల రోజులు అత్తారిల్లు వదలాలి.. ఎందుకో తెలుసా..

ఆషాఢమాసం రానే వచ్చింది. ఈ మాసం వచ్చిందంటే కొత్తగా పెళ్లి జరిగిన వారు అత్తింటిని వదిలి పుట్టింటికి వెళ్తుంటారు. ఈ మాసంలో కొత్త కోడలు అత్త ముఖం చూడకూడదని..అలాగే అత్తింట్లో కోడలు ఉండకూడదని అంటారు. ఇది చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయం. మరి అసలు ఈ సమయంలో కొత్త కోడలు అత్త ముఖం ఎందుకు చూడకూడదో ఇప్పుడు చూద్దాం..

ఆషాడ మాసం.. ఆషాడ మంత్, ఆది మాసం అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల. పండితుల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు. ఈ నెలలో శుభకార్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో వివాహాలు జరిపించరు. అవసరమైతే మూడు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ, భజంత్రీలు మోగించరు. 

తెలుగు పంచాంగం ప్రకారం ఆషాడ మాసం ప్రతీ ఏటా నాలుగవ నెలలో వస్తుంది. అయితే ఈ నెల అంటే జూలైలో ఆషాడ మాసం ప్రారంభం కానుంది. హిందువుల నమ్మకం ప్రకారం ఆషాడ మాసం చాలా ప్రత్యేకమైనది. ఆషాడ మాసంలో ఎన్నో శుభకార్యాలు ఉంటాయి. అంతేకాదు విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల కరుణించి వరాలు కురిపిస్తారని కూడా భక్తులు నమ్ముతారు. అయితే ఈ ఆషాడ మాసంలో ఇవే కాకుండా మరో ప్రత్యేక ఉంటుంది. హిందు సంప్రదాయం ప్రకారం ఆషాడ మాసంలో అత్తాకోడళ్లు కలిసి ఉండకూడదని పూర్వీకుల నుంచి ఈ ఆచారం వస్తోంది. 

హిందూ సాంప్రదాయాలకు భారతీయులు అధిక ప్రాధాన్యతనిస్తారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆచార వ్యవహారాలను ఇప్పటికి పాటిస్తూ ఉంటారు. ఇక ఆషాఢమాసం రానే వచ్చింది. ఈ మాసం వచ్చిందంటే కొత్తగా పెళ్లి జరిగిన వారు అత్తింటిని వదిలి పుట్టింటికి వెళ్తుంటారు. ఈ మాసంలో కొత్త కోడలు అత్త ముఖం చూడకూడదని..అలాగే అత్తింట్లో కోడలు ఉండకూడదని అంటారు. ఇది చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయం.  ఆషాడంలో అంటే సంస్కృత పదం. దీనిని ఆది అంటారు. ఆది అంటే శక్తి అని దీని అర్థం. అయితే ఆషాడ మాసంలో దేవతలు పూజించడానికి ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ తరుణంలో ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు, ఉపవాసాలు పాటిస్తారు. అంతే కాదు ముఖ్యంగా ఈ ఏడాది ఆషాడ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో చాలా యోగాలు ఏర్పడబోతున్నాయి. అయితే ఆషాడమాసంలో అత్తాకోడళ్లు కలవకూడదనే ఓ ఆనవాయితీ వస్తూ ఉంది. అయితే అసలు దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి.

కొత్తగా పెళ్లి అయిన మహిళలు అత్తింట్లో ఉండి ఉండి ఇబ్బందిగా ఫీలవుతారు. అందుకే వారికి కొంత ఉపశమనం ఇవ్వడం కోసం పుట్టింటికి వెళ్లాలనే నియమం పెట్టారట.ఆషాడ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరుగుతుంది. దీంతో తల్లీ, బిడ్డలకు అనారోగ్య సమస్యలు, రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు. వేసవిలో సాధారణ ప్రసవం వల్ల ఇబ్బందులు ఉంటాయి.. ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం హాస్పిటల్‌లో సరైన వైద్యం అందేది కాదు కాబట్టి.. ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్లట.

ఆషాడ మాసంలో అత్తాకోడళ్లు కలిసి ఉండకూడదు అని అంటారు. ఇలా చేయడం వల్ల భార్యభర్తల మధ్య ఎడబాటు ఏర్పడుతుంది. ఈ ఎడబాటు కారణంగా వారిద్దరు చింతిస్తుంటారు.  ఎందుకంటే పూర్వ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసి వ్యవసాయం పనులు చేసేవారు. . ఆషాడ మాసంలోనే వర్షాలు కురుస్తాయి కాబట్టి నాగలి పట్టుకుని పొలానికి వెళ్లి దున్ని విత్తనం వేయాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో వర్షం కారణంగా కొత్తగా పెళ్లి అయిన  భార్యభర్తలు ఇద్దరు ఇంట్లోనే కలిసి ఉంటే వ్యవసాయం చేయడం కష్టం అవుతుంది. కొత్తగా పెళ్లైన మగవాళ్ళు ఈ సమయంలో భార్య పక్కనుంటే ఏ పనిపై శ్రద్ధ పెట్టలేరు. అందుకే ఈ సమయంలో వైవాహిక జీవితం నుంచి ధ్యాస మళ్లించేందుకు భార్యను పుట్టింటికి వెళ్లాలని చెబుతుంటారు. 

ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయణం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయణం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢమాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢమాసంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది. ఉత్తరాయణ, దక్షిణాయన కథల ప్రకారం ఆషాడంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవనే నమ్ముతారు. ఆషాడమాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు. 

 ఆషాడమాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెబుతారు. అయితే ఆషాడం మాసంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయి. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట. ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాడంలో చిటికెన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి గోరు చిగురుకు చేరుతుంది.. గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలమని అంటారు.