మహిళ జీవితంలో ప్రెగ్నేన్సీ అనేది ఓ అద్భుతమైన అనుభూతి. ఈ సమయంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్త్రీ శరీరంలో అనేక రకాల హార్మోన్ల ప్రభావం ఉంటుంది. శరీరంలో మార్పులు పొందే హార్మోన్ల కారణంగా శరీరంలోని అవయవాల్లో మార్పులు జరుగుతాయి. శరీరం బరువెక్కడం, వాంతులు, తలనొప్పి, తల తిరగడం, ముఖం, చేతులు, కాళ్లు వాపులు ఎక్కడం వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే ముఖ్యంగా శరీరంలోని కాళ్లు, చేతులు వాయడాన్ని సైన్స్ లో ఎడెమా అంటారట. అసలు ఎడెమా అంటే ఏంటి, వాపులు రావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ టైంలో స్త్రీలలో అధిక రక్తపోటు సమస్య ఎదురవుతుంది. అందువల్ల కాళ్లు, చేతులు వాపులు వస్తాయి. అయితే వీటికి సాధారణంగా శిశువు అవసరాలను తీర్చడానికి శరీరం ఉత్పత్తి చేసే అదనపు రక్తం, ద్రవం వల్లే ఈ పరిస్తితి ఏర్పడుతుందట. శిశువు కోసం ఉపయోగపడే రక్తం వల్ల తల్లి శరీరంలో మార్పులు జరుగుతాయట. అందువల్ల పాదాలు, ముఖం, చేతులు వాపులు వస్తాయట. అంతేకాదు శరీరంలోని ఇతర భాగాల్లోను వాపులు వస్తాయట.
ఎడెమా అంటే వాపు అని అర్థం. గర్భాధారణ సమయంలో ఈస్ట్రోజన్, హెచ్సిజీ, ప్రోలాక్టిన్ వంటి అనేక హార్మోన్లు శరీరంలో పెరిగి వాపులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ సమయంలో మహిళలు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. శరీరంలో ప్రోటిన్, హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల కాళ్లు వాపులు ఏర్పడుతాయి. అయితే ఇవి డెలివరీ తర్వాత వాపులు వచ్చిన అవయవాలు తిరిగి సాధారణ స్థితికి వస్తాయట.
గర్భాధారణ సమయంలో వచ్చే అవయవాల్లోని వాపులను తగ్గించుకోవడానికి ఇంట్లోనే నివారణ మార్గాలు ఉంటాయి. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం, నిలబడడం వంటివి చేయడం వల్ల వాపులు వస్తాయి. విశ్రాంతి తీసుకుని, మంచం మీద పడుకుని ... పాదాల కింద 20 నిమిషాల పాటు దిండును ఉంచుకుని పడుకోవాలి. ఇలా చేసే వాపులు తగ్గే అవకాశాలు ఉంటాయట.
గర్భాధారణ సమయంలో తీసుకునే ఆహారంలో ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. పాదాలలో వాపును తగ్గించుకోవాలంటే ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ఎక్కువ సేపు ఒకే మాదిరిగా కూర్చోవడం వల్ల కూడా వాపులు వచ్చే అవకాశాలు ఉంటాయట. అందువల్ల 30 నిమిషాలకు ఒకసారి నడవడం, లేదా కూర్చునే పొసీషన్ మార్చడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.