పంచదార, బెల్లం మధ్య తేడా ఏంటి? ఏది మంచిది?

చెరకు లేదా బీట్‌రూట్ రసం నుంచి చక్కెర తయారవుతుంది. స్వీట్‌నెస్‌ కోసం ప్రజలు పంచదార లేదా బెల్లం వాడుతుంటారు. అయితే పంచదార ఎక్కువగా ప్రాసెస్‌ చేసి ఉంటుంది కాబట్టి దాని కంటే బెల్లం తినడం మంచిది. ఎందుకంటే బెల్లం ఇనుము, ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంటుంది.

రెండు తియ్యగానే ఉంటాయి.. అయితే ఒకటి వైట్‌గా ఉంటుంది.. ఇంకోటి ఎల్లో కలర్‌లో ఉంటుంది. రెండిటిని వంటింట్లో వాడుతుంటాం. కొన్నిసార్లు పంచదార వేస్తాం.. మరికొన్నిసార్లు బెల్లం వేస్తాం. బయట జిలేబీ షాపుల్లో పంచదార, బెల్లంతో చేసిన రెండు ఐటెమ్స్‌ మనకు కనిపిస్తాయి. మీరు గమనిస్తే వాటి కలర్‌ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కొంతమందికి పంచదారతో చేసిన స్వీట్‌ ఇష్టం.. మరికొంతమందికి బెల్లంతో చేసిన స్వీటును ఇష్టపడతారు. అయితే ఏది మంచిది? పంచదారతో చేసినవి కంటే బెల్లంతో చేసినవి తింటే మంచిదా? 

చక్కెర:ఇది సాధారణంగా చెరకు లేదా బీట్‌రూట్ రసం నుంచి తయారవుతుంది. దీన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. అందుకే ఇది పూర్తిగా తెల్లగా కనిపిస్తుంది. దాని ప్రాసెసింగ్‌లో రసాన్ని వేడి చేస్తారు.. దీని కారణంగానే తెలుపు రంగు చక్కెరకు వస్తుంది. అయితే ఇంత ప్రాసెస్‌ చేస్తారు కాబట్టే పంచదారను తక్కువగా తినాలి. పంచదారను అధికంగా తీసుకోవడం అంటే ఆరోగ్యానికి ప్రమాదకరమైన వ్యాధులను ఆహ్వానించడమేనని అనేక పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువగా పంచదారను వినియోగం వల్ల అన్నవాహిక క్యాన్సర్, ప్లూరల్ క్యాన్సర్, చిన్న ప్రేగు క్యాన్సర్ ప్రమాదాలను పెంచుతుందని పరిశోధనలు కనుగొన్నాయి. అధికంగా ప్రాసెస్ చేసిన పంచదారను ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ సమస్య కూడా పెరుగుతుంది. 8,000 మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రోజుకు 40 గ్రాముల కంటే తక్కువ చక్కెరను తినే పురుషుల కంటే 67 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ చక్కెరను వినియోగించే పురుషులు 23శాతం ఎక్కువగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు.

బెల్లం:నిజానికి బెల్లం, పంచదార కేలరీల విషయంలో సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండిటిని పోల్చినప్పుబు వైద్యులు బెల్లాన్నే వినియోగించాలని చెబుతుంటారు. ఎందుకంటే బెల్లం ఇనుము, ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి, బెల్లాన్ని ప్రాసెస్ చేయరు. అందుకే పంచదారను బెల్లంతో భర్తీ చేయడం మంచిది. ఇది మన శరీరానికి తీపి రుచితో పాటు కొన్ని పోషకాలను అందిస్తుంది.

  • పంచదారతో పోలిస్తే బెల్లంలో తక్కువగా గ్లూకోజ్​ కంటెంట్​ ఉంటుంది. పంచదార తినేవారిలో  తీసుకున్న వారిలో షుగర్​ లెవల్స్​  క్రమేణా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం ఉన్న వ్యక్తులు  బెల్లం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. 
  • బెల్లం  జీర్ణ క్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.  మలబద్ధకంసమస్యలున్న వారు బెల్లంతింటే చాలా మంచిది.  ఇది జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రేరేపించి...  జీర్ణవ్యవస్థను ఉపశమనం చేస్తుంది.
  • బెల్లంలోని పాలీఫెనాల్స్...  ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  ఇన్ఫెక్షన్లు .. దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడతాయి. రోజు తగినంత మోతాదులో బెల్లం తీసుకుంటే చాలా మంచిది.  
  • వాతావరణంలో వచ్చే మార్పులు..  ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే బెల్లంతో తయారు చేసిన పదార్దాలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.  పూర్వం  ఉదయాన్నే కాఫీ.. టీ.. పాలు తాగేటప్పుడు పంచదారకు బదులు బెల్లం వేసేవారు.