ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల ఎక్సర్ సైజులు చేస్తుంటారు. జిమ్ లో రకరకాల బరువులు ఎత్తి తెగ కష్టపడిపోతుంటారు. అయితే వాటన్నింటి కంటే జాగింగ్ చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. అందువల్ల జిము వెళ్లలేని వారంతా జాగింగ్ చేస్తూ ఫిట్ నెస్ని కాపాడుకోవచ్చు. ఎక్కువ మంది ఉదయాన్నే జాగింగ్ చేస్తే... కొంతమంది మాత్రం సాయంత్రం వేళల్లో చేస్తుంటారు. వాటిపై చాలామందికి అనుమానాలున్నాయి.
ఇది తెలుసుకునేందుకే కాలిఫోర్నియా, ఇజ్రాయిల్ యూనివర్సిటీల పరిశోధకులు ప్రయోగం చేశారు. చివరికి ఉదయం కంటే సాయంత్రం చేసే జాగింగే మేలని తేల్చారు. దీనికోసం సైంటిస్టులు ఎలుకల మీద ప్రయోగం చేశారు. థ్రెడ్మిల్స్ మీద వాటిని ఉంచి రోజులో వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఎక్సర్ సైజులు వీటి చేయించారు. ఆ తర్వాత చురుకుదనాన్ని నమోదు చేశారు. ఉదయం జాగింగ్ చేసిన వాటికంటే సాయంత్రం చేసిన ఎలుకలు 50 శాతం ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్లు గుర్తించారు. ఇదే మనుషులకు కూడా వర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సాయంత్రం సమయంలో జాగింగ్ వంటి ఎక్సర్ సైజులు చేస్తే మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందని నిర్ధారించారు..