కాఫీ కలర్ మారింది.. ఇక మీరు మిలమిల మెరిసిపోతారు..!

గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ అదే సమయంలో, గ్రీన్ కాఫీ ఒక ప్రత్యామ్నాయంగా మారింది. ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లాభాలేంటో తెలుసుకుందాం.

 మనలో చాలా మందికి చాలామందికి గ్రీన్ టీ గురించి తెలుసు. గ్రీన్ కాఫీ గురించి తెలియదు. గ్రీన్ కాఫీ అనేది ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాఫీలో ఉండే కెఫిన్ మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని ఇప్పటి వరకు మనం విన్నాం. అయితే గ్రీన్ కాఫీలో కెఫిన్ ఉండదని మీకు తెలుసా? ఇది ఆరోగ్యానికి హాని కలిగించదు.

 గ్రీన్ కాఫీ వాస్తవానికి కాల్చని ముడి కాఫీ గింజల నుండి తయారు చేస్తారు. ఇందులో  యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువుగా ఉంటాయి.  ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. గ్రీన్ కాఫీని బ్రోకలీ కాఫీగా కూడా పిలుస్తారు. ఎందుకంటే గ్రీన్ కాఫీ తయారీలో బ్రోకలీ ఉపయోగిస్తారు. బ్రోకలీ పౌడర్ సహాయంతోనే గ్రీన్ కాఫీ తయారవుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ కారణంగా శరీరం మెటబోలిజం మెరుగుపడుతుంది.

సమృద్ధిగా యాంటీఆక్సిడెంట్ : గ్రీన్ కాఫీ గింజలలో యాంటీ ఆక్సిడెంట్ భాగాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. అలాగే, అనేక జట్టు సమస్యలకు చెక్ పెడుతుంది.

మధుమేహం: సాధారణ టీ లేదా కాఫీకి బదులుగా గ్రీన్ కాఫీ తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. రీసెర్చ్ ప్రకారం, దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుంది.

రక్తపోటు ( BP) : మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, ఈ కాఫీ మీకు ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. తద్వారా గ్రీన్ కాఫీ గుండెపోటు సమస్యను కూడా నివారిస్తుంది.

 ఊబకాయం: ఉదయాన్నే టీ లేదా కాఫీకి బదులు గ్రీన్ కాఫీ తాగితే బరువు తగ్గుతారు. గ్రీన్ కాఫీ గింజల వినియోగం బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని చాలా అధ్యయనాలు కనుగొన్నాయి. గ్రీన్ కాఫీ తాగడం వల్ల పొట్టు చుట్టూ ఉండే కొవ్వు చాలా వేగంగా కరుగుతుంది.

 శక్తి అధికంగా ఉంటుంది: గ్రీన్ కాఫీ గింజల్లో క్రోనాలాజిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. దీంతో.. శక్తిని సమపాళ్లలో శరీరం అంతటా పంపిణీ అవుతుంది. అలాగే, మెరుగైన జీవక్రియను నిర్వహిస్తుంది.

చర్మానికి ప్రయోజనకరమైనది: గ్రీన్ కాఫీలో కొవ్వు ఆమ్లాలు, రైజిక్ ఆమ్లం, లినోలెయిక్ ఆమ్లం  ఒలేయిక్ ఆమ్లం ఉంటాయి, ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి.