రేపో.. ఎల్లుండో టెలిగ్రామ్ యాప్ బ్యాన్..? : నిషేధానికి కారణాలు ఇవే..!

టెలిగ్రామ్ యాప్ ఇండియాలో బ్యాన్ కాబోతున్నది. ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఇండియా సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ విచారణ చేస్తుంది. టెలిగ్రాం సీఈవో పావెల్ ను ఫ్రాన్స్ ప్రభుత్వం అరెస్ట్ చేయటంతో ఈ ఇష్యూపై.. ప్రపంచం మొత్తం దృష్టి పెట్టింది. టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేయాలనే ఆలోచన చాలా దేశాలు చేస్తున్నాయి. అందులో భారత్ ఒకటి. అసలు టెలిగ్రాం యాప్ బ్యాన్ చేయటానికి కారణాలు ఏంటీ.. ఎందుకు బ్యాన్ చేయాలి అని అనుకుంటున్నారో వివరంగా తెలుసుకుందాం..

అశ్లీలతకు అడ్డా.. హనీట్రాప్ కు మోనార్క్ : 

టెలిగ్రామ్ యాప్ లో ఎక్కువ అశ్లీలత వీడియోలు.. చైల్డ్ పోర్న్ కంటెంట్ ఉందని నిర్థారించింది ఇండియా సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ నిర్థారించింది. అదే విధంగా మహిళల అక్రమ రవాణాకు.. హనీట్రాప్ కు అడ్డాగా మాఫియా ఉపయోగించుకుంటుంది. ఇలాంటి కంటెంట్ ను తొలగించటంలో టెలిగ్రామ్ యాప్ విఫలమైంది. ఆయా దేశాలు, భారతదేశ చట్టాలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయంపై ఫ్రాన్స్ దేశం.. టెలిగ్రామ్ సీఈవో పావెల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంది. భారత్ సైతం ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ బ్యాన్ చేయాలనే ఆలోచనకు వచ్చింది. 

పరీక్ష పేపర్ల లీక్ :

మన దేశంలో ఇటీవల పరీక్ష పేపర్ల లీక్ అంతా మొదట టెలిగ్రామ్ నుంచే బయటపడింది. మే 5వ తేదీ జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ సైతం ఈ యాప్ నుంచే అందరికీ షేర్ అయ్యింది. అదే విధంగా జార్ఖండ్, రాజస్తాన్, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీక్ వ్యవహారంలో టెలిగ్రామ్ యాప్ కీలకంగా మారిందని విచారణలో నిగ్గుతేలింది. 

సినిమా, ఇతర పైరేటెడ్ కంటెంట్ :

సినిమా ఏదైనా సరే పైరేటెడ్ లింక్స్, వీడియోలు నిమిషాల్లో టెలిగ్రామ్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. అదే విధంగా ఈ బుక్స్, పేరడీ సినిమా కంటెంట్.. ప్రభుత్వాలు బ్యాన్ చేసిన వెబ్ లింక్స్ అన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. సంగీతం, సాఫ్ట్ వేర్ కు సంబంధించి కంటెంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. 

సెన్సార్ లేకుండా విద్వేష ప్రసంగాలు :

టెలిగ్రామ్ లో వచ్చే వీడియోల్లో సెన్సార్ అనేది లేదు. నియంత్రణ అస్సలు లేదు. సామాజిక కోణంలో ఈ యాప్ నిర్వహణ ఫెయిల్ అయినట్లు చెబుతోంది విచారణ సంస్థ. విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అల్లర్లు, విధ్వంసాల వీడియోలు యథావిధిగా యాప్ లో వస్తుంది. దీని వల్ల చాలా దేశాల్లో అల్లర్లు పెరగటానికి కారణం అవుతుంది టెలిగ్రామ్ యాప్.

టెర్రిరిస్టులకు అడ్డాగా మారింది :

టెలిగ్రామ్ యాప్ ద్వారా టెర్రరిస్టులు తమ యాక్షన్ ప్లాన్లు, కార్యక్రమాలు చేస్తున్నారంటూ విచారణ సంస్థలు తేల్చాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా టెర్రిరిస్టు గ్రూపులు.. ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా కమ్యునికేషన్ చేసుకుంటున్నారనేది అభియోగాలు ఉన్నాయి. 

ALSO READ | జియో AI వచ్చేస్తోంది: 100GB క్లౌడ్ స్టోరేజీ ఫ్రీ.. జియో టీవీ కూడా..

ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) విచారణలోనూ ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని.. భారతదేశంలోనూ టెలిగ్రామ్ యాప్ బ్యాన్ చేయాలనే సూచన చేస్తుంది. దీంతో భారత్ లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ చేసే విధంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. రేపో.. ఎల్లుండో అధికారికంగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.