ఆధ్యాత్మికం: దైవత్వం అంటే ఏమిటి? దైవ దర్శనం ఎప్పుడు కలుగుతుంది ?

దేవుడు.. దైవత్వం అంటే ఏమిటి..    దైవ దర్శనం ఎప్పుడు కలుగుతుంది....ఆత్మఙ్ఞానం ఎక్కడ ఉంటుంది..  గుడి.. గోపురాల్లో విగ్రహం రూపంలో ఉండే దేవుడు మనిషిలో ఉంటాడా.. ఉంటే ఎందుకు కనపడడు.. ఆ లోపం ఎక్కడ ఉంది.. ఆధ్యాత్మిక వేత్తలు.. పురాణాలు ఏంచెబుతున్నాయి. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

దేవుడు మనిషిలో ఉన్నాడని అన్నమయ్య.. భక్త రామదాసు నిరూపించారని పురాణాల ద్వారా తెలుసుకున్నాం.. నిజంగా మనిషిలో దేవుడు ఉన్నాడా.. ఉంటే ... ఏదైనా సర్జరీ చేసేటప్పుడు కడుపులో ఉన్న భాగాలను అన్ని డాక్టర్లు చూస్తారు కదా.. కనీసం వారికైనా కనపడాలి కదా.. మరి రాళ్లల్లో .. చెట్లల్లో.. పుట్టల్లో.. గుడిలో.. విగ్రహం రూపంలో ఉన్న ప్రతిమకు ఎందుకు పూజలు చేస్తున్నాం.. వాస్తవానికి  దేవుడు మనిషిలోనే ఉన్నాడనే సత్యమే ఆత్మజ్ఞానం... కాని అది కంటికి కనపడదు.  అయితే రెండు నిమిషాలు గాలి పీల్చకపోతే ( శ్వాశ తీసుకోకపోతే) మనం జీవించి ఉండలేం కదా.. గాలి లేదంటే  కుదురుతుందా.. కుదరని సైంటిస్టులు చెబుతున్నారు.  అలాగే ఆత్మఙ్ఞానం కూడా కనపడదు.. దీనిని చూసేందుకు లోపం దృష్టిలో ఉందే తప్ప సృష్టిలో లేదని రుషి పుంగవులు చెబుతున్నారు. 

పురాణాలు చెప్పిన విధంగా దయ, జాలి, కరుణ, ప్రేమ, - దైవీ సంపద మొదలగు వాటిని సత్వగుణాలు అంటారు.  ఇవి అవి దైవంలో అంతర్భాగంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇక  ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహంకారం, మమకారాలు- రజోగుణాన్ని ప్రేరేపించేందుకు సంకేతాలుగా ఉంటాయట.    అవి మనిషి స్వభావాన్ని.. . అరాచకం, నిర్లక్ష్యం, అకృత్యాలు, భయాందోళన కలిగించేవి తమోగుణాలు.. ఇవి రాక్షస ప్రవృత్తిని కలిగి ఉంటాయి.

Also Read :- ఈ ఫ్రూట్స్,ఆకు కూరలు తింటే పొగ తాగాలనే ఆలోచన తగ్గుతుంది..!

 సహజ స్వభావాలను  విడచిపెట్టి  దైవీ సంపదను  అలవాటుగా మార్చుకొని వాటిని అనుసరించి.. ఆప్రకారంగా జీవించిన  మనిషి దేవుడిగా మన్ననలందుకుంటాడు. మనిషిలోని ఆనందం స్వర్గం, దుఃఖమే నరకం అంటుంది సుమతీ శతకం. అందరిలోని చైతన్యాన్ని గౌరవించి, మానవీయ విలువలతో జీవించడమే ఆనందానికి మూలం. ఎదుటి మనిషిని గౌరవంగా ఆరాధించి, ప్రేమించి, సహాయం అందిస్తే అదే దైవత్వం.  ప్రతి మనిషిలో దైవాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక జ్ఞానమార్గం. అందరియందు, అన్నింటియందు సమత్వ దృష్టి మానవత్వమని భగవద్గీత బోధించింది.

చేతులతో, చేష్టలతో, మాటలతో బాధించడం.. అవమాన పరచడం వంటి లక్షణాలు అసురత్వానికి ( రాక్షస ప్రవృత్తి కలిగిన వారికి) నిదర్శనమని శంకరాచార్యులు అన్నారు..  ఓ వ్యక్తి శంకరాచార్యులకు ఎదురుగా వచ్చి పక్కకు తప్పుకొమ్మని చెప్పిన వ్యక్తితో - ఎవర్ని తప్పుకొమ్మంటావు... ఈ శరీరాన్నా, దీనిలోని అంతర్యామిగా ఉన్న దివ్యశక్తినా అని అడిగాడు. ఆ ప్రశ్నతో శంకరులలోని పరమేశ్వరుడిని ఆ వ్యక్తి  దర్శించారు. కోహం (ఎవరు నీవు) నుంచి సోహం (దైవమే నేను) వరకు ప్రయాణమే జ్ఞానమార్గమని శంకరాచార్యులు తెలిపారు.  

అంగవైకల్యం, శరీరం రంగు, బాహ్యమైన ఆకారం చూడకుండా మనిషిలోని దివ్య చైతన్యాన్ని విష్ణుస్వరూపంగా దర్శించాలని భక్తి, జ్ఞాన యోగాలు బోధించాయి.
శ్రీరాముడికి కోతుల్లో వీరత్వం, పరాక్రమం, త్యాగశీలత కనిపించాయి. కోతిగా జన్మించిన వానర వీరుడు అసమాన బలంతో, సేవాతత్పరతతో దేవుడిగా కీర్తిపొంది, ఊరూరా పూజలందుకొంటూ అభయప్రదాత ఆంజనేయుడైనాడు. (ఎలుగుబంటి) జాంబవంతుడు, రాక్షసుడైనా లంకా నగర చక్రవర్తిగా విభీషణుడు, స్నేహానికి ప్రాణమిచ్చిన సుగ్రీవుడు- జ్ఞాన సంపన్నులుగా నిలిచారు. సేవాభావాన్ని ప్రదర్శించి, ఉడుత శాశ్వత కీర్తి పొందింది. త్రేతా యుగంలో ఓ  స్త్రీని కాపాడాలని తన ప్రాణాలను త్యాగం చేసి పోరాడిన జటాయువు చరిత్రలో నిలిచిపోయింది.

మనిషిని ద్వేషించి ... దేశాన్ని ప్రేమిస్తే ప్రయోజనం లేదు. దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌ అన్న గురజాడ మాట ఎవరికైనా అడుగుజాడ.
మనిషి దైవత్వ లక్షణాలు సంతరించుకునే సాధనా మార్గాలే మానవతా విలువలు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనేవి పంచామృత మంత్రాలు. సత్యం శాశ్వతం. అంతటా వ్యాపించి ఉన్న సత్యాన్ని అన్వేషించకుండా అనుసరించాలి. సృష్టి సర్వం విష్ణుస్వరూపం అనే అనుభూతి సత్యమార్గం. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించడం ధర్మం. నీ పని నీవే చేయి, ధర్మం దానంతట అదే రక్షింపగలుగుతుంది.శారీరక శాంతి, మానసిక ప్రశాంతి ఆరోగ్యానికి మూలం. ధ్యానం, జపం, నామస్మరణ, ఆధ్యాత్మిక కార్యాచరణ- శాంతికి ప్రతిరూపాలు. నేను అనే అహంకారం, కావాలి అనే కోరిక తొలగితే- శాంతి మిగులుతుంది. ప్రేమకు పరిమితి లేదు. విశ్వజనీనమైన ఆరాధన భావం, క్షీరసాగరం వంటిది. ప్రేమను ఎంతగా ప్రేమిస్తే అది అంతగా అమృతాన్ని అందిస్తుంది.