Health News: డయాబెటిస్​ అంటే ఏమిటి.. ఎన్ని రకాలు.. ఎందుకొస్తుందో తెలుసా..

హైటెక్​ యుగంలో టైం మనిషిని ఉరుకులు పెట్టిస్తుంది. ఆఫీస్, ఇల్లు.. ఈ రెండింటి మధ్యలో ట్రాఫిక్...రోజంతా బిజీ బీజీగా గడుపుతున్నారు.  ఒత్తిడితో చాలా సతమతమవుతున్నారు.  ఆఫీసుకు వెళ్లడంతోనే గబాగబా కంప్యూటర్​ ఆన్​ చేయడం.. ఏసీకింద కూర్చోవడం.. వర్క్​తో కుస్తీ పడటం.  అయినా సరే.. శరీరానికి చెమట పట్టదు.  అందుకే  చెమట పట్టకుండా పనిచేస్తున్నాం కాబట్టి  నీకు తోడుగా నేనున్నానని చెబుతూ డయాబెటిస్​ వచ్చేస్తుంది.  అదేనండి షుగర్​ వ్యాధి. ఇక ఇది మనతో ఫ్రెండ్​ షిప్​ మొదలు పెట్టిందా అంటే ఏమీ తిననివ్వదు.  నీవేం తినద్దు అంటే హెచ్చరిస్తూ.. నోటికి తాళం వేసింది.  కాని అది మాత్రం మన శరీరాన్ని మాత్రం ఎంచక్కా ఆరగిస్తుంది డయాబెటిస్​ .  ఇంతకూ  డయాబెటిస్​ అంటే ఏమిటి.. అది ఎన్నిరకాలుగా ఉంటుందో తెలుసుకుందాం. . .

శరీరంలో ఉపయోగపడకుండా  మిగిలిపోయిన చక్కెర సాధారణ స్థితి కంటే ... ఎక్కువ మోతాదులో రక్తంలో ఉండటాన్ని డయాబెటిస్ అంటరు. డయాబెటిస్ టైప్-1,2,3 అని మూడు రకాలుగా ఉంటుంది.  

టైప్ 1 :ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. శరీరంలోని క్లోమ గ్రంథిలో బీటా సెల్ నుంచి వచ్చే ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయినప్పుడు ఇది వస్తుంది. ఇన్సులిన్ కలిసినప్పుడే షుగర్ శక్తిగా మారుతుంది. దీని ఫలితంగా శరీరంలో శక్తి ఉండదు.  ఇక శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి లేదు కాబట్టి.. అప్పుడు బయటి నుంచి అందించాల్సి ఉంటుంది. 

టైప్- 2 : నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్. అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల వచ్చేది టైప్ 2. సాఫ్ట్​ వేర్ ఇంజినీర్లు, ఊబకాయంతో ఉన్నవాళ్లలో, కాల్ సెంటర్లు, మార్కెటింగ్ వంటి రంగాలలో పని చేసే ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 

టైప్3డయాబెటిస్:  గర్భిణులకు వస్తది. డయాబెటిస్​ ను  నయం చేసే చికిత్స లేదు. కానీ, మంచి జీవనశైలి, డైట్ కంట్రోల్ చెయ్యొచ్చు. అందరిలాగే ఆరోగ్యంగా ఉండొచ్చు.

పని ఒత్తిడిలో సమయానికి తిండి తినకపోవడం..  ఆకలిని చంపుకోవడం.. లేదా ఎక్కువుగా తినడం.. ఎక్కువుగా ఆయిల్​ ఫుడ్​ తినడం  వంటి కారణాల వలన డయాబెటిస్​ వస్తుంది.  అయితే సాధారణ డయాబెటిస్ పేషంట్​ కి జనరల్, ఐడియల్ డ్రైట్, తిండిని బ్యాలెన్స్ చెయ్యడమే దీనిఫార్ములా.  ఏది తిన్నా మరీ ఎక్కువ కాకుండా...మరీ తక్కువ కాదన్నమాట. అయితే, మీ మెడికల్ కండిషన్ మీద సందేహం ఉంటే... డాక్టర్ని సంప్రదించిన తర్వాతే డైట్ ని అనుసరించాలి.

ఇక హైదరబాద్ నగరంలో 30 లక్షలకు మించి డయాబెటీస్ వారు ఉన్నారని Health surveys చెబుతున్నాయి.  అంటే మొత్తం జనాభాలో మూడో వంతు అన్న మాట.  హైదరాబాద్ నగరం దేశానికి రెండో రాజధాని మాట ఏమో గానీ…షుగర్ / Diabetic capital అని పేరు వచ్చేసింది.  ప్రతి మూడో వ్యక్తికీ షుగర్ ఉంటోంది అని తేలింది.