ఆధ్యాత్మికం : భక్తి అంటే ఏంటీ.. శంకరాచార్యులు చెప్పిన మార్గం ఏంటీ.. భాగవత ధర్మం ఏం చెబుతోంది..!

భగవంతుడు అంటే ఇతరుల కంటే గొప్పవాడు అని... లోకంలో మంచి పనులు చేస్తూ ఉండేవాళ్లనూ భగవంతుడు అని పిలుస్తుంటారు. భగవంతుడితో సంబంధం కలిగిన వాళ్లు భక్తులు. భాగవత ధర్మం ప్రకారం భగవాన్ అంటే భగవంతుడు అని, భాగవత అంటే భక్తుడు అని చెప్తారు. అంటే భగవంతుడితో సంబంధం కలిగి ఉండటమే భక్తుడి పని.

భగ..  అంటే అదృష్టం....వాన్.. అంటే కలిగి ఉన్న వ్యక్తి. .. అంటే చాలా అదృష్టం కలిగి ఉన్న వాళ్లన్నమాట.  ధనవంతులు, బలం కలవాళ్లు, తెలివైనవాళ్లు, అందమైనవాళ్లు, పదవి ఉన్నవాళ్లు. లోకంలోని సుఖాలను వద్దనుకునే వాళ్లను అదృష్టవంతులు అంటారు. ఎందుకంటే, మనిషి సంతోషంగా, సంపూర్ణంగా జీవించడానికి ఈ ఆరు అదృష్టాలు అవసరం. వీటన్నింటిని ఇవ్వమని దేవుడిని వేడుకుంటారు మనుషులు. భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధాల గురించి ప్రాచీన గ్రంథాలు ఎన్ని చెప్పినా, అవి లోకంలో మనకు కనిపించే బంధాల్లాంటివే

Also Read :- ఆకాశంలో అద్భుతం..100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలా..!

నాలుగు మార్గాలు

  • 1. శంకరాచార్యులు ....వివేకచూడామణి.... గ్రంథంలో మోక్షాన్ని పొందడానికి ఉన్న సామాగ్రిలో భక్తే గొప్పదని చెప్పారు. వేదాలు, ఉపనిషత్తులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుని. వాటికి అనుకూలంగా జీవించడం భక్తికి సంబంధించిన మొదటి మార్గం. జీవాత్మ, పరమాత్మ తత్వానికి చెందినదీ భక్తి. అయితే ఇలాంటి మార్గం అందరికీ సాధ్యమయ్యేది కాదు. సమాజంలోని కట్టుబాట్లు, సాధారణ జీవితాన్ని కాదని  ఈ మార్గాన్ని ఎంచుకోవా లి. ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణిలో పరమాత్మ ను చూడాలంటే అందరికీ కుదిరే పనికాదు. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్న వాళ్లు చాలా తక్కువ. ప్రస్తుత సమాజంలో కూడా ఎవరూ దేవుడికోసం ఈ భక్తి మార్గాన్ని అనుసరించడం లేదు. ...కుదిరేది కూడా కాదు.
     
  • 2. భక్తికి చెందిన రెండో మార్గం పూజలు, వ్రతాలు చేస్తూ భగవంతుడికి దగ్గరవడం.. ఇవి ప్రస్తుత సమాజంలో కూడా చాలామంది చేయడానికి అవకాశం ఉంది. గౌరీవ్రతం,కార్తీక సోమవార వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం...  వైకుంఠ ఏకాదశి వ్రతం ..ఇవన్నీ పురాణాల్లో చెప్పారు. దేవాలయాలు, ఇళ్లల్లో కూడా పూజలు చేస్తూ, దేవుడిని వేడుకుంటూ ఉంటారు. భక్తులు. రోజువారీ పనులు చేసుకుంటూనే పండుగలు, వేడుకలు, ప్రత్యేకమైన రోజుల్లో ఇలాంటివి చేస్తున్నారు. ఈ మార్గం కేవలం దేవుడిని చేరుకోడానికి మాత్రమే కాకుండా... మనుషుల్లో క్రమశిక్షణ, మంచి ఆలోచనలు కలగడానికీ తోడ్పడుతుంది. తోటి మనుషులతో అన్యోన్యంగా ఎలా మెలగాలో కూడా ఆయా కార్యక్రమాల్లో వినే కథలవల్ల తెలుస్తుంది.
     
  • 3.  దేవుడిని కేవలం రూపం లేని వాడిగా కాకుండా, ఏదో ఒక రూపంలో చూసుకుంటూ పూజించేది మూడవ మార్గం. గుడిలో విగ్రహాలు, బొమ్మలు, శిలలు... లాంటివన్నమాట. అయితే, ఈ మార్గంలో దేవుడిని వివిధ కళల ద్వారా పూజిస్తారు భక్తులు. సంగీతం, నాట్యం. సాహిత్యం ద్వారా భగవంతుడిని కీర్తిస్తారు. గోపికలు, రాధ... కృష్ణుడి కోసం ఇలాంటి భక్తి మార్గాన్నే ఎంచుకున్నారు. త్యాగరాజు, ముత్తుస్వామి కూడా తమ సంగీతంతో భగవంతుడిని అర్చించారు. ఇది కేవలం దేవుడిని చేరుకునే మార్గం మాత్రమే కాదు. ఈ కళల ద్వారా శారీరక, మానసికమైన సంతోషాన్నీ ఇస్తాయి. ఒత్తిడి నుంచి బయటపడేస్తాయి. తిరిగి ఉత్సాహాన్ని ఇస్తాయి. అభిరుచి ఉన్న వాళ్లు ఈ కళల్లో రాణించడానికి ఇదో మంచి మార్గం.
     
  • 4. భక్తికి సంబంధించిన చివరి మార్గం. చాలా సులభం అయింది. ఎక్కువమంది... ఆచరించేది. పురాణాలు, శాస్త్రాలు చదవాల్సిన పనిలేదు. కష్టమైన నియమాలు పాటించాల్సిన అవసరమూ లేదు. ఎవరికి వాళ్లు ధర్మ బద్దంగా, విలువలతో బతికితే చాలు. కష్టపడి పనిచేసుకుంటూ సంపాదించుకుంటూ సంతోషంగా జీవించాలి. గుళ్లు గోపురాలు కట్టించి కీర్తి తెచ్చుకోడానికి ప్రయత్నించక్కర్లేదు. ఒకరికి అన్యాయం చేయకుండా, బాధపెట్టకుండా సొంత శక్తితో బతకడం. ప్రేమతో, స్నేహంగా ఉండటం. ఇలాంటి వాటి వల్ల సమాజానికే కాదు, వ్యక్తికి కూడా మంచిదే

భక్తి అన్నది భగవంతుడు, భక్తుడు అనే ఇద్దరి మధ్య ఉన్న ఒకానొక సంబంధం మాత్రమే కాదు. చుట్టూ ఉన్న సమాజంతో కలిసి బతకడం. లావాదేవీలు, మొక్కుబడులు పెట్టుకుని కోర్కెలు తీర్చమని అడగడం అంతకన్నా కాదు. అందర్నీ మంచివైపు నడిపేది. .. ప్రభావితం చేసేది. తండ్రీ కొడుకుల సంబంధంలా, భార్యాభర్తల బంధంలా, స్నేహితుల్లా.... భగవంతుడికి భక్తుడికి ఉన్న బంధాన్ని చూడాలి. స్వతంత్రంగా జీవిస్తూనే, మిగిలిన వాళ్లతో ఎలా కలిసి బతుకుతారో... అలాంటిదే భగవంతుడి బంధమని శంకారాచార్యుల వారు చెప్పారు.