ఆధార్ కార్డు గురించి అందరికి తెలుసు.. దేశ పౌరులందరికి విశిష్ట గుర్తింపు కార్డుగా భారత్ ప్రభుత్వం ఆధార్ కార్డును అందజేస్తుంది. విదేశాల్లో ఉన్న భారతీయులకు కూడా ఈ 12 అంకెల నంబరు గల ఆధార్ కార్డును భారత ప్రభుత్వం పేరిట భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI ) జారీ చేస్తుంది. మనకు ఆధార్ కార్డు ఆధార్ లేఖ, ఆధార్ PVC కార్డు, e Aadhaar, mAadhaar వంటి వివిధ రూపాల్లో అందుబాటులో ఉంది. మరి అన్ని ఆధార్ కార్డులే కదా.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం..
సాధారణంగా ఆధార్ కార్డు కోసం అప్లయ్ చేసుకున్నప్పుడు UIDAI మనకు ఆధార్ నెంబర్ ను జారీ చేసిన తర్వాత రిజిస్టర్ చేయబడిన అడ్రస్ కు ఓ లెటర్ ను పంపిస్తుంది.. ఇదే ఆధార్ లెటర్.. దీనిలో వ్యక్తి గుర్తింపుకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి..
ఆధార్ PVC కార్డు అంటే.. ఆధార్ ఎలక్ట్రానిక్ కార్డ్ (ఇ ఆధార్) కు ఫిజిలక్ వెర్షన్.. ఇది డిజిటల్ సతకం చేయబడిన QR కోడ్, ఫొటోగ్రాఫ్ తో కూడిన PVC కార్డు.. దీనిని ఆఫ్ లైన్ ధృవీకరణకు ఉపయోగించవచ్చు. ఆధార్ PVC కార్డు అనేది తమ వెంట తీసుకెళ్లగలిగే ఆధార్ కార్డు.. వాలెట్ లో పెట్టుకోగలిగే మన్నికైన వెర్షన్.
ఆధార్ PVC కార్డ్ ద్వారా సెక్యూరిటీ ఫీచర్స్
1.ట్యాంపర్ ప్రూఫ్ QR కోడ్
2. హోలోగ్రామ్
3. మైక్రోటెక్ట్స్
4.గోస్ట్ ఇమేజ్
5.జారీ చేసిన తేది, ముద్రణ తేది
6.గిల్లోచే నమూనా
7. ఎంబోస్డ్ ఆధార్ లోగో
వీటి ద్వారా ఆధార్ PVC కార్డ్ డేటాకు సంబంధించిన మరింత భద్రతను అందిస్తుంది.
ఆధార్ లేఖ అనేది నమోదు, నవీకరణ తర్వాత నివాసితులకు జారీ చేయబడిన లామినేటెడ్ పేపర్ ఆధారిత పత్రం. ఆధార్ కార్డ్ అనేది PVC ఆధారిత మన్నికైనది ,బహుళ భద్రతా లక్షణాలతో PVC కార్డ్‌ని తీసుకువెళ్లడం సులభం. అన్ని రకాల ఆధార్‌లు (eAadhaar, mAadhaar, Aadhaar లెటర్, ఆధార్ కార్డ్) సమానంగా చెల్లుబాటు అవుతాయి.