health tips: అరటిపండ్లు అతిగా తింటే ఏమవుతుంది? రోజుకు ఎన్ని అరటిపండ్లు తినొచ్చు?

అరటిపండును సుపర్ ఫుడ్ గా చెబుతారు. బనానా రోజు తినడం వల్ల శక్తి పెరగడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్  కూడా పెరుగుతుంది.  ఫైబర్, విటమిన్లు, మినరల్స్, షుగర్, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్  నిండిన అరటి జీర్ణక్రియకు సహయపడుతుంది. బ్లడ్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుందని. కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. వెయిట్ లాస్ కు కూడా బనానా మంచి ఫుడ్ అని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి. 

అయితే ఎంత మంచి న్యూట్రీషన్ ఫుడ్ అయినా అతిగా తింటే అనర్థాలకు దారి తీస్తుంది. వాటిలో అరటిపండు కూడా ఉంది. అతిగా తింటే అమృతం కూడా విషమవుతుందన్నట్టుగా ఈ పండు కూడా లిమిట్ గా తీసుకోవాలి. అయితే అతిగా అరటి తినడం వల్ల జరిగే నష్టాలు ఏంటి? రోజుకు ఎన్ని అరటిపండ్లు తినవచ్చొ ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

రోజుకు ఎన్ని అరటి పండ్లు తినొచ్చు

రోజుకు రెండు అరటిపండ్ల కంటే ఎక్కువ తినకూడదని న్యూట్రీషన్స్ చెబుతున్నారు. శారీరక శ్రమ , వర్క్ ఔట్స్ ఎక్కువ చేసేవారు మాత్రమే మూడు అరటిపండ్ల వరకూ ఒక రోజులో తినవచ్చట. వీటిలో రక్తంలో షుగర్ లెవల్స్ పెంచే గ్లైసెమిక్ ఉంటుంది. డయాబెటిస్ పేషంట్స్ ఇవి తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

అతిగా తింటే ఏం అవుతుంది?

అరటిపండ్లలో ఉండే న్యాచురల్ షుగర్ కారణంగా అతిగా తింటే దంత క్షయానికి వస్తుంది. అంతే కాదు.. అరటిలో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అతిగా తింటే వల్ల నరాల దెబ్బతినవచ్చు. సరిగా పండని అరటి తింటే మలబద్ధకం, గ్యాస్, అజీర్తి కి దారితీస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు బనానా మితంగా తినాలి. ఎందుకంటే అరటిలో పొటాషియం అధికం ఇది మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ :- Good Health: ఎండు ఆకుల పొడి రోజూ వాడితే కొలెస్ట్రాల్ కు చెక్...