Aadhaar Card: చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు నంబర్ రద్దు అవుతుందా.. ఆ కార్డును ఎక్కడ సరెండర్ చేయాలి?

ఇప్పటివరకు ఆధార్ కార్డు వినియోగం గురించి.. ఆధార్ కార్డులో తప్పులుంటే ఎలా సరిచేసుకోవాలి.. వాటికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాం.. కానీ చాలామందిలో ఒక సందేహం ఉంది..అదేంటంటే..చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డును ఏం చేయాలి..ఏ అధికారికైనా అప్పగించాలా..లేక వాటిని తగలబెట్టాలా..ఇలా చాలా డౌట్లు వస్తుంటాయి. ఒక్క ఆధార్ కార్డే కాదు..పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా చనిపోయిన వ్యక్తి పేరున ఉన్న  డాక్యుమెంట్లను ఏం చేయాలో.. మిస్ యూజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.. 

ఆధార్ కార్డు.. 

ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమో అందరికి తెలుసు..ప్రభుత్వ పథకాలు, ఎల్ పీజీగ్యాస్ సబ్సిడీ, స్కాలర్ షిప్ లు, ఈపీఎఫ్ అకౌంట్ నిర్వహణ వంటి వాటికి ఇది తప్పనిసరి. చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు సరెండర్ చేసేందుకు ప్రత్యేకమైన నిబంధనలు ఏమీ లేదు.. UIDAI వెబ్ పోర్టల్ లోకి వెళ్లి లాక్ చేసుకోవచ్చు. డెత్ సర్టిఫికెట్ సమర్పిస్తే చాలు.. ఇలా చేస్తే.. వారి ఆధార్ కార్డు మిస్ యూజ్ కాకుండా ఉంటుంది. 

పాన్ కార్డు.. 

చనిపోయిన వ్యక్తి పాన్ కార్డు ను తప్పకుండా ఇన్ కం టాక్స్ డిపార్టుమెంట్ కు సరెండర్ చేయాలి. ఫారం 30  పూర్తి  చేసి, డెత్ సర్టిఫికెట్ సమర్పించి  వ్యక్తి చనిపోయినట్లు తెలియజేయాలి. దీనికంటే ముందు చనిపోయిన వ్యక్తి అకౌంట్లను కుటుంబ సభ్యుల పేర్లకు మార్పిడి చేసుకోవాలి. ఇలా చేసే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. 

ఓటర్ ఐడీ .. 

వ్యక్తి చనిపోతే .. అతని కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఓటర్ గుర్తింపు కార్డు కాన్సలేషన్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. దీనికోసం ఎన్నికల సంఘం ఆఫీసులో సంప్రదించడం గానీ,ఫారం 7 నింపడం గానీ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా డెత్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఇలా చేస్తే.. ఓటర్ ఐడీ కార్డు ఎక్కడా మిస్ యూజ్ కాకుండా జాగ్రత్త పడొచ్చు. 

పాస్ పోర్టు.. 

ఆదార్ కార్డులాగే  పాస్ పోర్టు కు కూడా క్యాన్సలేషన్ కోసం ప్రత్యేక నిబంధనలు లేవు.. రీజినల్ పాస్ పోర్టు ఆఫీసు కు వెళ్లి రాత పూర్వకంగా ఒక లెటర్ ఇస్తే చాలు. పాస్ పోర్టుతో పాటు డెత్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఇదంతా పాస్ పోర్టు ఎక్స్ పైర్ కాకముందే చేయాలి.. లేకుంటే క్యాన్సిల్ కాదు. 

ALSO READ | Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే