డింక్ అంటే ఏంటి?.. ఎన్ని రకాలు?

ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది! ఆఫీస్‌ నుంచి ఇంటికెళ్లి పిల్లలతో కాసేపు గడిపితే అప్పటివరకు పడ్డ స్ట్రెస్​ అంతా మాయమవుతుంది. ఇదంతా ఒకప్పటి తరం ఆలోచన. కానీ.. ఈ జనరేషన్‌లో కొందరు మాత్రం పిల్లలు లేకపోవడమే బెటర్‌‌ అంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వాళ్లలో కొందరు ‘ఖర్చు ఉండదు. బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అంటుంటే... మరికొందరేమో పర్యావరణానికి మేలు చేస్తున్నాం’ అంటున్నారు. ఒకప్పుడు పిల్లలు లేకపోవడం చెప్పుకోలేని బాధ. ఇప్పుడు పిల్లలు ఉండడమంటే భరించలేని ఖర్చు! అందుకే ‘డ్యుయల్‌ ఇన్‌కం నో కిడ్స్‌’ అనే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది కపుల్స్‌.

ఎన్ని రకాలు 

ఆదాయం ఉండి పిల్లలు వద్దు అనుకునేవాళ్లను సాధారణంగా డింక్‌‌లు అని పిలుస్తుంటారు. అయితే.. పిల్లల్ని కనకపోవడానికి గల కారణం, వాళ్ల లైఫ్‌‌ స్టైల్‌‌ బట్టి వాళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు. 


డింక్‌‌వాడ్​: భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తారు. కానీ పిల్లలు కనడానికి ఇష్టపడరు. వీళ్లు కాలక్షేపం కోసం కుక్కల్ని పెంచుకుంటారు.
డింకర్​:  డబుల్​ ఇన్​కం నో కిడ్స్‌‌ లైఫ్‌‌ లీడ్ చేస్తూ.. ఎర్లీగా రిటైర్​మెంట్​ తీసుకుంటారు. ​
సింక్​ : సింగిల్​ ఇన్​కం, నో కిడ్.​
డింక్​వాక్: డబుల్​ ఇన్​కం, నో కిడ్స్​. వీళ్లు పిల్లుల్ని పెంచుకుంటారు.
డినో: డబుల్​ ఇన్​కం నో ఆప్షన్స్​ (లిమిటెడ్​ లేదా ఎమర్జెన్సీ సేవింగ్స్​ ఉంటాయి.)
డింకీ: డబుల్​ ఇన్​కం, నో కిడ్స్​ ఎట్​ (టెంపరరీగా పిల్లలు వద్దనుకుంటారు.)
డింప్: డ్యూయల్​ ఇన్​కం, మనీ ప్రాబ్లమ్స్.​
జింక్: గ్రీన్​ ఇన్​క్లైన్డ్​, నో కిడ్స్.​
సిన్​బ్యాడ్: సింగిల్​ ఇన్​కం, నో బాయ్​ఫ్రెండ్, పూర్తి నిరాశ.