ఓం నమ: శివాయ అంటే ఏమిటి... ఈ మంత్రాన్ని జపిస్తే కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసా....

నమశిఃవాయ అనే పదం మనం చాలా సార్లే విని ఉంటాం.వినడమే కాదు రోజులో చాలా సార్లు మనసులో కూడా అనుకొని ఉంటాం.  వాస్తవాలు ఓం నమః శివాయ అనే మంత్రంలో న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాలున్నాయి. ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీళ్లు, అగ్ని, గాలి, విశ్వాన్ని సూచిస్తాయి.  ఈ మంత్రం స్మరించుకుంటూ ఉంటే.. అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

నమఃశివాయ అంటే ఆ పరమ శివుడిని గుర్తు చేసుకోవడమే...  ధ్యానించడం మాత్రమే కాదండోయ్... నమఃశివాయలో.....

 

  •  న అంటే నభం అంటే ఆకాశం అని అర్థం. 
  • మ అంటే మరుత్‌ అంటే వాయువు.  
  • శి  అంటే శిఖి.... అనగా అగ్ని అని అర్థం.
  • వా అంటే వారి..అనగా జలం....
  • య అంటే యజ్ఞం.యజ్ఞానికి భూమి అనే అర్థం 


ఈ అయిదింటికీ ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆది దేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలూ హరించి పోతాయని పురాణాలు చెబుతున్నాయి.

అలాంటి పంచ భూతాత్మకుడైన పరమ శివుడిని నమఃశివాయ అనే మంత్రంతో స్మరిస్తాం.  పరమ శివుడిలోని స్వార్థం లేని తనం, భోలాతనం కలగలిపిన నిరాడంబరత, నిస్వార్థాన్ని గురించి ఈ మంత్రం చెబుతుంది.

మన మనసు ఈ సుగుణాలన్నింటితో పరిపూర్ణ స్థితిలో శరీర ధర్మాల నుంచి ఆ సర్వేశ్వరుని పాదాల చెంత చేరి ముక్తిని ప్రసాదించమని .... శివ పంచాక్షరీ స్తోత్రాన్ని రచించారు. ఆ మంత్రంలోని ముఖ్య ఉద్దేశం కూడా ఇదే.అయితే ఓం నమః శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు.ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమ, నిష్టలు కూడా ఉన్నాయి. తెల్లవారు జామునే నిద్ర లేచి.తలస్నానం ఆచరించి నిటారుగా కూర్చోవాలి. ఆ తర్వాత కళ్లు మూసుకుని, జప మాల తీసుకుని ‘ఓం నమ: శివాయ‘ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాలి.ఇలా శివ పంచాక్షరీ స్తోత్రాన్ని చదవితే...ఆ పరమేశ్వరుడు కచ్చితంగా మనల్ని కరుణిస్తాడు. ఒకవేళ జపమాల లేకపోతే.. వేళ్లతో లెక్కపెట్టుకోవచ్చు. ధ్యానం 108 సార్లు మంత్ర జపం పూర్తి అయిన తర్వాత అలాగే.. కొన్ని నిమిషాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరం గ్రహిస్తుంది.

ఓం నమః శివాయ... ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం. సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు. ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది. హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు. శివ భక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు. ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల.. శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది. అంతేకాదు శివ భక్తులు వీలైనప్పుడల్లా ఓం నమః శివాయ అని స్మరించుకుంటూ ఉంటే.. అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. 

యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు. ప్రయోజనాలు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి. దుష్టశక్తులు దరిచేరకుండా కాపాడుతుంది. డిప్రెషన్ ఈ మంత్రాన్ని క్రమంతప్పకుండా స్మరించడం వల్ల మెదడు, శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే డిప్రెషన్, నిద్రలేమి, మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఒత్తిడి తగ్గించి, ప్రశాంతత కలిగిస్తుంది. 108 సార్లు ప్రతి రోజూ ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు స్మరించడం వల్ల కోపం, ఆవేశం తగ్గుతాయి.