హెయిర్ ఫాల్ చాలామందిని వెంటాడే ప డే సమస్య. ఆరోగ్యంగా ఉన్న వాళ్ల జుట్టు కూడా ఉన్నట్టుండి రాలిపోతుంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో మాత్రం అర్థంకాదు. కానీ బరువు తగ్గే సందర్భాల్లో మాత్రం జుట్టు రాలుతుందని చెబుతున్నారు డాక్టర్లు.
జుట్టు రాలడానికి, తీసుకునే డైటికిమధ్య సంబంధం ఉంటుంది అనేది చాలా తక్కువ మందికి తెలిసిన నిజం! హెల్త్ సరిగ్గా ఉంటేనే జుట్టు కూడా హెల్దీగా పెరుగుతుంది. తినే తిండిలోని పోషకాలు, విటమిన్లు, ఎంజైమ్ సరిగ్గా ఉన్నప్పుడు జుట్టుకు ఏ చింతా ఉండదు. అయితే శరీరానికి శక్తిని అందించే ఆహారాన్ని మిస్ అవుతున్నప్పుడు సరైన పోషకాలు అందవు. దాంతో జుట్టు రాలిపోతుంది. లేదంటే జుట్టు సరిగ్గా పెరగదు. డైటింగ్ లో ఉంటే?
బరువు తగ్గడానికి చాలామంది డైటింగ్ చేస్తుంటారు. ఈ టైంలో కూడా జుట్టు రాలుతుందా? అంటే 'నో' అనే అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే.. డైటింగ్లో సరైన ప్లాన్తో ఫుడ్ ఇన్హేక్ ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. హెల్దీ డైట్ బరువును తగ్గిస్తుంది అంతే. కానీ జుట్టు మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు. సరైన న్యూట్రిషన్ ఫుడ్ అంటే క్యాలరీలు, ప్రొటీన్లు, కొవ్వు, తగినన్ని, మైక్రో న్యూట్రియెంట్స్ అన్నీ శరీరంలోని కణాలను, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయని ఫరీదాబాద్ లోని ఫోర్టిస్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ కిరణ్ దలాల్ చెబుతున్నారు.
డైట్ లో న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి జుట్టు ఊడటానికి డైట్కు సంబంధం ఉండదు. అయితే ఒక్క నెలలో నాలుగు నుంచి ఐదు కిలోలకు మించి బరువు తగ్గితే... న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదని అర్థం. దాని వల్ల కలిగే ప్రొటీన్, ఐరన్, విటమిన్ల లోపమే బరువును తగ్గించి, జుట్టు పెరగడంపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. సో! జుట్టు రాలుతోంది అంటే.. టెన్షన్ పడకుండా హెల్దీఫుడ్ మీద ఫోకస్ చేయాలన్నమాట.