ధ్యానం చేయడం వల్ల చాలా ఉపయోగాలున్నాయని ఇటీవల చాలామంది చెప్తున్నారు. యోగా, ధ్యానం చేయండని సూచిస్తున్నారు. ఉపనిషత్తులు, మహాభారతం, భగవద్గీతలో ధ్యానం గురించి చెప్పారు. బృహదారణ్యక ఉపనిషత్తులో ధ్యానం గురించి చెప్తూ.. నిశ్చలంగా, ఏకాగ్రతగా ఉంటూ, తనలోకి తాను చూసుకుంటూ, ఆత్మను వీక్షించడమే ధ్యానం అని ఉంది. పతంజలి యోగ సూత్రాల్లో కూడా ధ్యానం గురించి చెప్పాడు.
అయితే పతంజలి దేవుడి మీద మనసు పెట్టి. అతడే లక్ష్యంగా ధ్యానం చేయాలన్నారు. శూన్యం కంటే, దేవుడి మీదే మనసు నిమగ్నం చేయమని చెప్పాడు. ఆధ్యాత్మిక భావనలో ధ్యానం అంటే ఆత్మజ్ఞానం పొందడం అంటారు. మంచి ప్రవర్తనను కలిగి ఉండటం కూడా ధ్యానంలో భాగమే. ధ్యానం చేయడం వల్ల మానసిక, శారీరక ఉపయోగాలున్నాయి. అహంకారం, కోపం, ఈర్ష్య, ఒత్తిడి లాంటి చెడు గుణాలు తగ్గుతాయి. అలాగే శారీరక ఆరోగ్యానికి సంబంధించి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. రోజంతా ఉత్సాహంగా గడపొచ్చు.