ఆడ తిమింగలాలను ఎట్రాక్ట్ చేయడానికి మగ తిమింగలాలు పాటలు పాడతయట..!

ఆడవాళ్లకు తమ ప్రేమని చెప్పడానికి మగవాళ్లు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. కొందరు లెటర్లు రాస్తారు. మరికొందరు మెసేజ్​​లు పంపుతారు. అలాగే మగ తిమింగలాలు ఆడ తిమింగలాలను ఎట్రాక్ట్ చేయడానికి, అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి పెద్దగా పాటలు పాడతాయి. ఈ పాటల వల్లే ఆడ, మగ ఒకదాన్ని మరొకటి కనుక్కోగలుగుతాయి. అందుకే వాటి మనుగడకు ఈ పాటలు చాలా ముఖ్యం అంటున్నారు సైంటిస్ట్​లు.

తిమింగలాలు పాడితే ఆ సౌండ్స్​ దాదాపు1,000 కిలో మీటర్ల (600 మైళ్ళు) దూరం వరకు వినిపిస్తాయి. కొన్ని తిమింగలాల పాటలు అంతకంటే ఎక్కువ దూరం కూడా వినిపిస్తాయి. హంప్​బ్యాక్​ అనే వేల్స్​ ఆస్ట్రేలియాలో పాడితే ఫ్రెంచ్ పాలినేషియాలో తిమింగలాలకు వినిపిస్తోందట! పాటలు పాడడానికి వాటి బాడీలో ప్రత్యేకంగా ‘వాయిస్ బాక్స్’ ఉంటుంది. బ్లూ, హంప్‌బ్యాక్, రైట్, మింకే, గ్రే వేల్స్​తో సహా మొత్తం14 జాతుల్లో ఇలాంటి వాయిస్​ బాక్స్​లను గుర్తించారు.