Good Food : చీజ్తో బరువు కూడా తగ్గొచ్చని ఎంత మందికి తెలుసు..!

* పిజ్జా, బర్గర్ లలోనే కాకుండా రకరకాల ఫుడ్ ఐటమ్స్ చీజ్ వేసుకొని తింటున్నారు. చీజ్ ను ఎలా తిన్నా దాని ద్వారా వచ్చే ప్రొటీన్స్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్ మాత్రం ఎక్కడికీపోవు.
* మార్కెట్ లో ఫెటా, పర్మేసన్, మోజరెల్లా అని చాలా రకాల చీజ్లలు ఉన్నాయి. చీజ్ లో ఉన్న న్యూట్రియెంట్స్ వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. కండరాలు దృడంగా. అయ్యేందుకు హెల్ప్ అవుతుంది. ఎముకల
పెరుగుదలకు సాయ పడుతుంది.

* టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా కాపాడుతుంది. రోజు 40 గ్రా. చీజ్ తినడం వల్ల గుండెకు ఆరోగ్యం, శరీరానికి ఇమ్యూనిటీ పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.ఇలానే కాకుండా చీజ్ ను చాలా ఫుడ్ ఐటమ్స్ వాడొచ్చు. 
• సలాడ్స్ ఇష్టపడని వాళ్లకు చీజ్ మంచి ఆల్టర్నేట్, ఫెటా నీళ్లు ఎక్కువగా సలాడ్లను తయారు చేయడానికి వాడతారు. చీజ్ ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి నబాద్ లో కలిపితింటే టేస్ట్ బాగుంటుంది.

• బ్రేక్ ఫాస్ట్ ను హెల్తీగా చేయడానికి చీజ్ హెల్ప్ చేస్తుంది. ఆమ్లెట్ లేదా ఏ బ్రేక్ ఫాస్ట్ అయినా చీజ్ న్ను కలుపుకొని తినొచ్చు. ఇది బ్రేక్ ఫాస్ట్ టేస్టీగా చేయడమే. కాకుండా న్యూట్రియెంట్స ను ఇస్తుంది. అలాగే తక్కువ ఫ్యాట్ ఉన్న కుకింగ్ ఆయిల్ను వంటల్లో వాడటం బెటర్. మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తింటూ బరువు తగ్గాలి అనుకునే వాళ్లు చీజ్ ను ఉడకబెట్టిన కూరగాయల్లో వేసి హ్యాపీగా తినొచ్చు. బ్రొకొలి, వంకాయ వంటి వాటిల్లోకి చీజ్ ని కలిపి తినేయొచ్చు.
* మాంసం తినని వాళ్లకు చీజ్ మంచి ఆల్టర్నేట్ అంటే రెండింట్లో ఒకేరకమైన ప్రొటీన్స్ ఉన్నా, చీజ్ లో మాత్రం గుడ్ ఫ్యాట్ఉంటుంది. ఈ ఫ్యాట్ వల్ల గుండెకు ఏ ప్రాబ్లమ్ ఉండదు.
* ఫ్రూట్స్ చీజ్ కలుపుకొని స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. పుచ్చకాయతో ఫెటా చీజ్, రాస్ బెర్రీతో క్రీమ్ చీజ్, మామిడి పండు, యాపిల్ కూడా చీజ్ ని కలిపి తినొచ్చు.

Also Read : చివరి బంతికి ఆరు పరుగులు..సంచలనం సృష్టించిన జింబాబ్వే క్రికెటర్