వారఫలాలు ( సౌరమానం) సెప్టెంబర్ 01 నుంచి 07 వరకు

మేషం : చేపట్టిన కార్యక్రమాల్లో స్వల్ప అవాంతరాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందడుగు వేస్తారు. రాబడికి లోటు ఉండదు.  సన్నిహితులతో వివాదాల పరిష్కారం. ఆస్తుల వ్యవహారాల్లో సోదరులతో అంగీకారం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం. సంఘంలో పేరుప్రతిష్టలు. వ్యాపారులకు తగిన లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకోని ఆహ్వానాలు. 

వృషభం : నిరుద్యోగుల ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వాహన, గృహయోగాలకు అవకాశం. వ్యాపారులు భాగస్వాములతో జరిపే చర్చలు సఫలం. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. 

మిథునం : చిరకాల కోరిక ఒకటి నెరవేరే సూచన. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తువులు కొంటారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు. సోదరులతో విభేదాల పరిష్కారం. ఎంతోకాలంగా చూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. విదేశీ విద్యావకాశాలు. వ్యాపారులకు ఉత్సాహవంతం. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం : ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. మీపై బంధువులు మరింత ప్రేమానురాగాలు చూపుతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. అయినా లెక్కచేయక కార్యదీక్షాపరులై ముందుకు సాగుతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారుల యత్నాలు సఫలం.

సింహం : కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయుల ఆదరణ. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో మీపట్ల అపార్ధాలు తొలగుతాయి. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వ్యాపారులకు లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.  

కన్య : చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. దీర్ఘకాలిక సమస్య ఒకటి బంధువుల సహకారంతో తీరుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. వివాహయత్నాలు సానుకూలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారులకు అనుకున్న పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కే సూచనలు. రాజకీయవేత్తలు, పరిశోధకులు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

తుల : ఆశ్చర్యకరమైన రీతిలో ధనప్రాప్తి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. వ్యవహారాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానం. కోర్టు వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

వృశ్చికం : చేపట్టిన కార్యాలు సజావుగా పూర్తి. ఆలోచనలకు కార్యరూపం. మీ అంచనాలు నిజమయ్యే సమయం. ఆప్తుల నుంచి కీలక విషయాలు తెలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు. వ్యాపారులు అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు కొన్ని క్లిష్ట సమస్యలు తీరతాయి. గృహవాహన కొనుగోలు ప్రయత్నాలు సానుకూలం. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకుల కృషి కొంతమేర ఫలిస్తుంది.

ధనస్సు : కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. చర్చల్లో ప్రతిష్ఠంభన. ఇంటి నిర్మాణ యత్నాలు మందగిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారులు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనల్లో అవాంతరాలు. వారాంతంలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి.

మకరం : పరిచయాలు విస్తృతమవుతాయి. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ప్రత్యర్థులతో సఖ్యత. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. చేపట్టిన కార్యాలు దిగ్విజయం. మీ అంచనాలు, ఊహలు నిజం కాగలవు. వాహనసౌఖ్యం. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  

కుంభం : చిరకాల ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఒక వ్యక్తి ద్వారా ఊహించని రీతిలో సాయం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. గృహవాహనాలు కొంటారు. సోదరులతో విభేదాలు సర్దుకుంటాయి. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు.

మీనం : కొత్త కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. నూతన ఉద్యోగయత్నాల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఆదాయం పెరిగినా ఖర్చులు ఉంటాయి. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారులకు లాభాలు కొంతమేర లభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.  వారారంభంలో వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400