వారఫలాలు (సౌరమానం) నవంబర్ 10 నుంచి నవంబర్ 16 వరకు

ఈవారం ( నవంబర్​ 10 నుంచి 16 వ తేది వరకు)  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. మేషరాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మిధున రాశి  వారు వ్యాపార రంగంలో మంచి లాభాలు గడిస్తారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. . .

మేషం: మేష రాశి వారికి ఈ వారం ( నవంబర్​ 10 నుంచి 16 వ తేది వరకు) అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఎలాంటి మార్పు ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం.. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  అయితే స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.

వృషభం: ఈ రాశి వారికి ఈ వారమంతా సంతృప్తికరంగా ఉన్నా... కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.  వృత్తి.. వ్యాపారాలు కలసి వచ్చినా.. ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులు ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబసభ్యులతో.. స్నేహితులతో విబేధాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దని జ్యోతిష్యనిపుణులు సూచిస్తున్నారు. 

మిథునం: ఈ రాశి వారికి  అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగబాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఆదాయపరంగా అన్ని రంగాల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.

కర్కాటకం : ఈ రాశి వారు ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. తలపెట్టిన పనులకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది.  ఆర్థిక సమస్యలు వచ్చినా... సమయానికి డబ్బు అందుతుంది,  ఇక ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. వృధా ఖర్చులు చేయవలసిన అవసరం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 

సింహం : ఈ రాశి వారు ఈ వారంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.  వృత్తి .. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.  వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త పెట్టు బడులు పెడితే మంచి లాభాలు వస్తాయి.  గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తుకు ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు, ఉద్యో గులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనుకోని ప్రయాణాలు.. పుణ్యక్షేత్రాల్లో పర్యటించే అవకాశాలున్నాయి.

కన్య: ఈ రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు వేగవంతంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలసి వస్తాయి. వృత్తి .. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.  ఆర్థిక పరంగా కొంత పురోగతి ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులనుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు  విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంటుంది. 

తుల: ఈ రాశి వారికి జీవిత భాగస్వామి నుంచి ఆస్తి వచ్చే అవకాశం ఉంది.  కొత్తగా ఇంటిని నిర్మించే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి.. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. 

వృశ్చికం: ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.  కుటుంబసభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వాహన యోగం అవకాశాలున్నాయి. వ్యాపారాలు లాభంగా .. ఉన్నా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.  చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి.

ధనస్సు: ఈ రాశి వారికి పెద్దల అండదండలుంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదాలు సమసిపోతాయి.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

మకరం: ఈ రాశి వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు,  ఒత్తిడి తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది,  ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి.  కొత్తవారిని కలుసుకునే అవకాశం ఉంది.  పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పదోన్నతియోగం. విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి. 

కుంభం: ఈ రాశి వారికి వృత్తి... వ్యాపారాలు ...నిలకడగా సాగుతాయి.  ఉద్యోగస్తులకు, విద్యార్థులకు మంచి అనుకూల సమయం.  ఆర్థిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.  ఆరోగ్య విషయంలో ఎలాంటి  మార్పు ఉండదు.  నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా ఉంటుంది. 

మీనం: ఆర్థిక విషయాల్లో  చాలా జాగ్రత్తగా ఉండండి.  ధన పరంగా ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వవద్దు. ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయండి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు.  వ్యాపారస్తులు అధికంగా శ్రమ చేయాల్సి ఉంటుంది. గతంలో మీనుంచి ఆర్థిక సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఖర్చుల విషయంలో  జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.