వారఫలాలు (సౌరమానం) నవంబర్ 03 నుంచి నవంబర్ 09 వరకు

మేషం :  ఈ వారం వీరికి అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగ, వ్యాపారంలో  పరిస్థితులు  అనుకూలిస్తాయి.  ఉద్యోగులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంటుంది.  ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలసిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి.  చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం.. గృహనిర్మాణం చేపట్టే అవకాకాశాలున్నాయి,. 

వృషభం :  కొత్త ఉద్యోగ ప్రయత్నాలు  ఫలిస్తాయి.  ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.  కొద్ది శ్రమతో అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి.  వ్యాపారులకు మంచి లాభాలుంటాయి. వ్య క్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో కొంత రిలీఫ్​ ఏర్పడుతుంది.  పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి అనుకోకుండా సంబంధం కుదిరే అవకాశం ఉంది.    ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

మిథునం :  ఈ రాశి వారు ఆహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా పురోభివృద్దితో పాటు వాహన యోగం కూడా అవకాశం ఉంది.ఉద్యోగస్తులు అనుకోకుండా కొన్ని బాధ్యతల నుంచి తప్పుకోవలసి రావచ్చు.వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకోకుండా మార్పులు సంభవిస్తాయి. ఈ వారం ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా విజయవంతం అవుతుంది. ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి.  

కర్కాటకం :  ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు సరైన సమయం.  ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.  కుటుంబసభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది,  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం.  ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు.   ఉద్యోగం మారాలనుకునే వారు వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. 

సింహం : కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా.. కుటుబ సభ్యలతో చర్చించి నిర్ణయం తీసుకోండి.  ఉద్యోగస్తులు కష్టపడాల్సి ఉంటుంది.  వారాంతంలో అంతా మంచే జరుగుతుంది.  వారం మధ్యలో అనుకున్న పనులు పూర్తవుతాయి,  అధికారులు ఎక్కువుగా మీపై ఆధారపడతారు.పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. 

కన్య :ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.  కొందరు మిత్రుల వలన నష్టపోయే అవకాశం ఉంది. తోటి  ఉద్యోగస్తులుతో.. కుటుంబసభ్యులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి,  అనుకోకుండా ప్రయాణం చేయల్సి రావచ్చు,  వారం మొదట్లో చికాకు కలిగించినా,, వారాంతంలో అంతా మంచే జరుగుతుంది. వ్యాపారస్తులుకు, ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. 

తుల : నిరుద్యోగులకు ఇది మంచి అనుకూల సమయం.  దూర ప్రాంతాల్లో  ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు  అనుకూల ఫలితాలు ఉంటాయి.  అనుకోకుండా ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి.  ఆర్దిక పరంగా ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వవకపోవడమే మంచిది.  అనుకోకుండా ప్రయాణాలు.. వృధా ఖర్చు  ఉండే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. . 

వృశ్చికం : ఆర్థిక సమస్యలు తీరడంతో.. సేవింగ్స్​చేసేందకు ప్లాన్​ చేస్తారు.  వృత్తి.. వ్యాపారాల్లో అనుకున్నంత లాభాలు రాకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. పెళ్లికి సంబంధించి గుడ్​ న్యూస్​ వింటారు.  వారాంతంలో కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం.  నిరుద్యోగులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి.  స్నేహితులు.. కుటుంబసభ్యుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. 

ధనస్సు : ప్రేమవ్యవహారం కొలిక్కి వస్తుంది.  ఉద్యోగస్తులకు.. వడ్డీ వ్యాపారులకు కలసొచ్చే కాలం.  మొండి బకాయిలు వసూలవుతాయి.  వ్యాపారస్తులు కొత్త కార్యప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశం,  ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.  ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఆర్ధిక విషయంలో ఎలాంటి మార్పు ఉండడదు.  ముఖ్యమైన వ్యవహారాలు.. పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి సమాచారం అందుతుంది. 

మకరం : ఈ వారం మిశ్రమఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు హోదాతో పాటు వేతనం పెరిగే అవకాశం..  ఉద్యోగస్తులు జాబ్​ మారే అవకాశం..అదనపు ఆదాయానికి చేపట్టిన ఫలితాలు నెరవేరుతాయి.  వ్యాపారస్తులు అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది.  శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. పిల్లల విషయంలో శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది.  స్థానచలనం కలిగే అవకాశం ఉంది. 

కుంభం : ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది.  ఆదాయం బాగున్నా.. ఖర్చులు అధికమవుతాయి.  ఇతరుల విషయాల గురించి పట్టించుకోవద్దు.  వ్యాపారస్తులకు మిశ్రమఫలితాలుంటాయి. వారం మధ్యలో నుంచి అంతా శుభమే జరుగుతుంది.  ఉద్యోగస్తులు .. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మానసికంగా బలంగా ఉండేందుకు ప్రయత్నించండి.  ప్రతి విషయంలో కష్టపడినా.. అంతిమ విజయం మిమ్మలనే వరిస్తుంది. 

మీనం : వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఫలితాలు ఆశాజనికంగా ఉంటాయి.   సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కీలక విషయాల్లో పట్టు సాధించడంతో పాటు.. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశం. నిరుద్యోగులకు  మంచి అవకాశాలు వస్తాయి.  దూరపు బంధువులు కలుస్తారు.  ఆరోగ్య విషయం సానుకూలంగా ఉంటుంది.