వారఫలాలు (సౌరమానం) డిసెంబర్ 22 వ తేదీ నుంచి 28వ తేదీ వరకు

ప్రతిరోజు గ్రహాలు మారుతుంటాయి.  జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం మేషరాశి సంతోషంగా గడుపుతారు. మిథునరాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.  కర్కాటకరాశి వారు బిజీ బిజీగా గడుపుతారు. ధనస్సు రాశి వారు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలని పండితులు సూచిస్తు్న్నారు.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మిగతా రాశుల వారికి  ఈ వారం ( డిసెంబర్ 22 నుంచి 28 వరకు) ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . 

మేషరాశి:  ఈ వారం ( డిసెంబర్ 22 నుంచి 28 వరకు మేషరాశి వారు సంతోషంగా గడుపుతారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు వారం మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది.  ప్రేమ విషయంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కలదు. ఆరోగ్య పరంగా ఉదర సంబంధమైన వ్యాధితో బాధపడే అవకాశం ఉంటుంది.  ఎవరితోనూ అనవసరంగా మాట్లాడవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.  వారం చివరిలో  విహార యాత్ర చేసే అవకాశం ఉంది.  

వృషభరాశి:  ఈ రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల సహాయంతో ప్రేమ పెళ్లి జరిగే అవకాశం ఉంది.  ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం కలదు.  స్థాన చలనం కలిగే అవకాశం కూడా ఉంది.  వ్యాపారస్తులకు కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. పెళ్లి ప్రయత్నాలు కలసి వస్తాయి. వారాంతంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయి. పూర్వీకుల ఆస్థి కలసి వస్తుంది. 

మిథున రాశి:  ఈ రాశి వారు ఈ వారంలో ( డిసెంబర్ 22 నుంచి 28 మధ్యలో) పిల్లల కెరీర్ కు సంబంధించి మంచి నిర్ణయం తీసుకుంటారు.  ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ అందుకుంటారు.  మొండి బకాయిలు వసూలవుతాయి.  కొత్త పనులను వాయిదా వేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు సభలు.. సమావేశాల కారణంగా బిజీగా గడుపుతారు.  ఆర్ధిక విషయంలో కొద్దిగా పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు ఓపికతో నిర్ణయాలు తీసుకోవాలి.  బిజినెస్ చేసే వారు అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఇతరుల మాటను తొందరగా నమ్మవద్దని పండితులు సూచిస్తున్నారు. 

కర్కాటక రాశి:  ఈ రాశి వారు ఈ వారం కొంత అసంతృప్తితో గడుపుతారు.  పెట్టుబడులు పెట్టే విషయాన్ని వాయిదా వేసుకోండి. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు.  విద్యార్థుల విషయంలో కేరీర్ పరంగా నిర్ణయాలు తీసుకుంటారు.  ఆర్థిక విషయాల్లో మిశ్రమఫలితాలుంటాయి.  వారం మధ్యలో నుంచి కొంత ఊరట లభిస్తుంది. స్థిర ఆస్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కొన్నొ కొత్త ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మంచి సంబంధం కుదురుతుంది.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది.  ఉద్యోగంలో మీకు ఏర్పడిన పరిస్థితుల రీత్యా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం  ఉంది. మీకు  సహోద్యోగులు అండదండలుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  కుటుంబ సభ్యుల మధ్య ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. 

కన్యారాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి.  డబ్బు పొదుపు చేస్తారు.  ఇప్పటి వరకు పెట్టిన అనవసర ఖర్చును నియంత్రిస్తారు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ద చూపుతారు.  మీ కొలీగ్స్ సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి.  ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది.  కొత్తగా వాహనాలను కొనుగోలు చేస్తారు.  కొత్తగా లోన్ తీసుకునేందుకు ఆశక్తి చూపుతారు. ఇప్పటివరకు ఉన్న కుటుంబసభ్యుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. వారం చివర్లో పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.  వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. 

వృశ్చికం:  ఈ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి.  కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. కొంత అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.  అవసరం లేకపోయినా కొన్ని వస్తువులను కొనాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. వారం చివరిలో అంతా బాగుంటుంది.  వీకెండ్ లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  కొన్ని కారణాల వలన ఆగిపోయిన ప్రాజెక్ట్ లు మళ్లీ ప్రారంభమవుతాయి.  కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు.  పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది, ప్రేమికులు సంతోషంగా గడుపుతారు. 

ధనుస్సు రాశి: ఈ వారం కొత్త ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుడతారు.  మీకు ప్రతిష్ఠతో పాటు సోషల్ నెట్ వర్క్ పెరిగే అవకాశం ఉంది.  రియల్ ఎస్టేట్ రంగం వారికి అధికంగా లాభాలు వస్తాయి.   ప్రేమికులు వాదించుకోకండి.  ఉద్యోగస్తులు... వ్యాపారస్తులకు అన్ని విధాలా కలసి వస్తుంది.  ఉద్యోగస్తులు ఉన్నతాథికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయి.  అయితే కొన్ని అదనపు ఖర్చులను నియంత్రించుకోండి. కుటుంబంలో ఆనందం...  సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

మకరరాశి:  ఈ రాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులు  మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తగా ఇంటిని నిర్మించేందుకు ప్లాన్ చేస్తారు,  నిరుద్యోగులకు మంచి  ఉద్యోగం వస్తుంది.  ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.  ఆరోగ్యవిషయంలో కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ కెరీర్ ను అభివృద్ది చేసుకొనేందుకు ప్రయత్నిస్తారు.  కుటుంబసభ్యుల మధ్య ఉన్న వివాదాలుపరిష్కారం అవుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. వ్యాపారస్తులు తీసుకున్న నిర్ణయాలు ఆర్థికంగా లాభాన్ని చేకూరుస్తాయి.  ఉద్యోగస్తులకు కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. 

కుంభ రాశి :  ఈ రాశి వారికి గతంలో ఉన్న గందరగోళ పరిస్థితులు  తొలగిపోతాయి.  కొన్ని కారణాల వలన ఆగిపోయిన ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులు.. వ్యాపారస్తులు తీసుకున్న నిర్ణయాలు ఆర్థికంగా ఉపయోగపడతాయి.  కుటుంబంలో గుడ్ న్యూస్ వింటారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది.  విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంది. కొంత సొమ్మును దేవాలయాలకు విరాళంగా ఇస్తారు.   ప్రభుత్వ ఉద్యోగం,  ఆహార ఉత్పత్తులు, పురుగుమందులు, నిర్మాణ వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారాల్లో అధికంగా లాభాలొస్తాయి. ప్రేమికుల మధ్య సంయమనం కుదురుతుంది. 

మీన రాశి: ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.  కొత్త పెట్టుబడులను వాయిదా వేయండి.  మీ సంకల్స బలం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ఖర్చులను తగ్గించుకోండి. మీ ఉద్యోగంలో ప్రయోజనాలను పొందుతారు.  అప్పులు తీర్చే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తల్లి దండ్రుల ఆరోగ్యం కొంత ఆందోళనకుగురి చేస్తుంది.వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  ఎలాంటి వివాదాల్లో  పాల్గొనవద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.