వారఫలాలు ( సౌరమానం) ఆగస్టు 04 నుంచి 10 వరకు

మేషం : ఆదాయానికి మించి ఖర్చులు. కొత్త రుణాల కోసం అన్వేషణ. దూరప్రయాణాలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన కార్యాలు నిదానంగా సాగుతాయి. మీ అంచనాలు కొన్ని తప్పి నిరాశ చెందుతారు.  దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారులకు గందరగోళం. ఉద్యోగులకు స్వల్ప మార్పులు. పారిశ్రామికవేత్తలకు పరీక్షాసమయమే. కళాకారులు, ఐటీ నిపుణులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం : ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ధన, వస్తులాభాలు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఆసక్తికర సమాచారం. సమాజంలో గౌరవప్రతిష్టలు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. చిరకాల కోరిక నెరవేరే సూచనలు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. నూతన భాగ స్వాములు చేరే సూచన. ఉద్యోగులకు విధి నిర్వ హణలో ప్రోత్సాహకరం. పారిశ్రామికవేత్తలకు ముఖ్య సమాచారం.

మిథునం : ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ముఖ్య విషయాలపై కుటుంబంతో చర్చిస్తారు. ఆలోచనల అమలు. స్థిరాస్తులు కొంటారు. నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తీరే సూచనలు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి సహకారం అందవచ్చు. క్రీడాకారులు సత్తా చాటుకుంటారు. 

కర్కాటకం : ఆస్తి వివాదాల పరిష్కారం. శత్రువులు అనుకూలంగా మారతారు. ఎంతటి కార్యమైనా పట్టుదలతో పూర్తి. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. రాబడి గతం కంటే మెరుగుపడుతుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా తేలికగా పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని ప్రగతి. వైద్యరంగం వారి కృషి ఫలిస్తుంది.

సింహం : ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలు పూర్తి. విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగయత్నాల్లో కదలికలు. బంధువులు, స్నేహితులతో సఖ్యత. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు క్రమేపీ లాభాలు. ఉద్యోగులు సరైన గుర్తింపు పొందుతారు. రాజకీయవేత్తలకు విజయాలు వరిస్తాయి. కళాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు.

కన్య :  భూయోగం. ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి. రాబడి పుంజుకుంటుంది. ఆస్తి విషయాల్లో కొత్త ఒప్పందాలు. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా. చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులు వివాదాల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలకు కొత్త అనుమతులు. క్రీడాకారులు, పరిశోధకులకు ఉత్సాహంగా గడుస్తుంది.

తుల : కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు కొంత సహాయపడతారు. భూములు, ఆభరణాలు కొంటారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. నిరుద్యోగుల కల ఫలించవచ్చు. శత్రువులు సైతం అనుకూలురుగా మారతారు. వ్యాపారులకు లాభాలు. విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు విధుల్లో మంచి గుర్తింపు. పారిశ్రామికవేత్తలకు కీలక సమాచారం అందుతుంది.

వృశ్చికం : రాబడి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీరే సమయం. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి  కాగలవు. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో విశేష గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ప్రయత్నాలు సఫలమవుతాయి.

ధనస్సు : కొత్త కార్యాలు చేపడతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. శుభకార్యాల నిర్వహణయత్నాలు ముమ్మరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో విజయం. వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో అవాంతరాలు తొలగుతాయి. భాగస్వాముల నుంచి సాయం. ఉద్యోగులకు విధుల్లో ఊరట. పారిశ్రా మికవేత్తలు, కళాకారులకు ఉత్సాహం. వైద్యులు, పరిశోధకులకు ఊహించని గుర్తింపు.

మకరం : సమాజంలో గుర్తింపు. ఆదాయం ఆశించినంత దక్కి అవసరాలు తీరతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. దూరపు బంధువుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనే వీలుంది. వ్యాపారులు సత్తా చాటుకుంటారు. ఉద్యోగులు విధుల్లో దూసుకుపోతారు. రాజకీయవేత్తలు ఆశయాలు సాధిస్తారు. కళాకారులు, క్రీడాకారులకు ఊహించని పురస్కారాలు.

కుంభం :  కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. అప్పులు తీరతాయి. అదనపు ఆదాయం. ముఖ్యమైన కార్యక్రమాలు టైంకి పూర్తి చేస్తారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారులకు మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఉద్యోగులకు స్వల్ప ఇంక్రిమెంట్లు. పరిశోధకులు, క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.

మీనం : ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. విద్యార్థులు, నిరుద్యోగులు విజయాలు సాధిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. సమర్థవంతంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఇళ్లు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలు అనుకున్న పదవులు  పొందే సూచనలు. వైద్యరంగం వారికి  విశేష ఆదరణ.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400