మేషం : పలుకుబడి, ఉన్నతస్థితి కలిగిన వారు పరిచయమవుతారు. ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. శత్రువులను సైతం ఆదరిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకోని విదేశీయానం.
వృషభం : సమస్యల పరిష్కారంలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి. స్థిరాస్తి విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాబడి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు మంచి గుర్తింపు.
మిధునం : ఏపని చేపట్టినా విజయవంతంగా పూర్తి. ఆత్మీయులు, బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురై ఆశ్చర్యపోతారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం. రాజకీయవేత్తలు, కళాకారులు సత్తా చాటుకుంటారు.
కర్కాటకం : ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కార్యాలు చక్కదిద్దుతారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆశించిన ఆదాయం. దీర్ఘకాలిక రుణఒత్తిడులు తొలగుతాయి. కుటుంబంలో వివాహాల విషయంలో చర్చలు. ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూల సమయం.
సింహం : ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వాహన, గృహ కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారి సాయపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక,రాజకీయవేత్తలు, క్రీడాకారులు విదేశీ పర్యటనలు జరుపుతారు.
కన్య : దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. ఎవరి సాయం లేకుండానే ముఖ్యమైన కార్యాలు పూర్తి. సమాజంలో ప్రత్యేక గౌరవం. విద్యావకాశాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. వ్యాపారులు అనుకున్న సమయానికి విస్తరణ పూర్తి. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు ఆహ్వానాలు.
తుల : ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు ఉండవచ్చు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మనసులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలు, రచయితలు, కళాకారులకు విదేశీయానం.
వృశ్చికం : ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వచ్చే అవకాశం. ఆదాయం మెరుగుపడి ఊరట లభిస్తుంది. సన్నిహితులతో సఖ్యత. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తుల వ్యవహారాల్లో గందరగోళం తొలగుతుంది. వివాహాది వేడుకల నిర్వహణ యత్నాలు ముమ్మరం చేస్తారు. మీ నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు. ఉద్యోగులకు హోదాలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, న్యాయవాదులకు అనుకూల సమయం.
ధనుస్సు : పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన కార్యాలు వేగంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. గృహం కొనుగోలు, నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభించే వీలుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు అందుతాయి.
మకరం : రాబడి ఆశాజనకం. నేర్పుతో కొన్ని సమస్యల పరిష్కారం. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్య కార్యాలు దిగ్విజయం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు. ఉద్యోగులకు హోదాలు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు గుర్తింపు.
కుంభం : పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు సాధిస్తారు. ప్రముఖులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు.
మీనం : అనుకున్న ఆదాయం. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. పరిచయాలు విస్తృతం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న హోదాలు రావచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు గుర్తింపు.