వార ఫలాలు: 2024 ఫిబ్రవరి 04 నుంచి 10 వరకు


మేషం : కొన్ని వ్యవహారాలకు సంబంధించి చర్చలు మందగిస్తాయి. ఆస్తుల విషయంలోనూ ఇబ్బందికర పరిస్థితులు. ఆరోగ్య విషయాలపై నిర్లక్ష్యం వద్దు. అయితే క్రమేపీ  అనుకూలత ఉంటుంది. చిన్ననాటి విషయాలను నెమరువేసుకుంటారు. బంధుగణం మీపై మరింత  ప్రేమ చూపుతారు. ఆదాయానికి మొదట్లో లోటు ఏర్పడినా తిరిగి పుంజుకుంటారు. వ్యాపారాలలోని వారికి మరింత వెసులుబాట్లు కలుగుతాయి. ఉద్యోగులు విధులు సకాలంలో చక్కదిద్దుతారు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

వృషభం : అదనపు ఆదాయం. భవిష్యత్తు బంగారుమయంగా మారే అవకాశం. ఆస్తి పంపకాలు ఫలప్రదం. వ్యతిరేకులను దారికి తెచ్చుకుంటారు. కొత్త వాహనాలు కొంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి. వివాహయత్నాల్లో పురోగతి. పరిచయాలు విస్తృతం. హోదాల్లోని వారు ఆప్యాయంగా పలకరిస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు. వ్యాపారులు రాణిస్తారు. ఉద్యోగులకు సంతోషకర విషయాలు తెలుస్తాయి. కళాకారులు, క్రీడాకారులు, రచయితలకు తగిన గుర్తింపు.

మిథునం : అనుకున్న లక్ష్యాలు నెరవేరడానికి కష్టపడాలి. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి  చేయడంలో ఇతరుల సాయం అర్ధిస్తారు. ప్రయాణాలను చివర్లో వాయిదా వేస్తారు. కుటుంబసభ్యుల వైఖరి, వ్యవహారశైలి ఇబ్బందిగా ఉంటుంది. క్రమేపీ అనుకూలత కనిపిస్తుంది. భవిష్యత్తుపై నిరుద్యోగులు, విద్యార్థులకు భరోసా. ఆర్థికంగా ఊరట. గృహ, వాహనయోగాలు. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం. ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వద్దు. కళాకారులు, పరిశోధకులకు  విజయాలు. 

కర్కాటకం : అప్పులు తీరతాయి. జీవిత భాగస్వామి, సోదరులతో సఖ్యత. ఆస్తుల వివాదాలు పరిష్కారం. రాబడికి లోటు లేకున్నా ఇతరులకు ఇచ్చిన హామీలకు బకాయిలు చెల్లించాల్సి వస్తుంది. తొందరపాటు మాటలకు స్వస్తి చెప్పి అందర్నీ ఆకట్టుకునే యత్నం చేస్తారు. మీ నిర్ణయాల్లో పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. వ్యాపారులకి కలిసొచ్చే కాలం. ఉద్యోగులు మెరుగ్గా విధులు నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు మిశ్రమంగా ఉంటుంది.

సింహం : అనుకున్న కార్యక్రమాలు కొన్ని శ్రమానంతరం పూర్తి. పరిమితులకు మించిన ఖర్చులు. ఏదోవిధంగా సొమ్ము సమకూరే సూచనలు. ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి. వివాహాది వేడుకలపై నిర్ణయించుకోలేరు. స్థిరాస్తి విషయంలో ఆశాజనక ఒప్పందాలు. కీలక వ్యక్తి ద్వారా అవసరమైన సాయం అందుతుంది. వాహన, గృహ యోగాలు. వ్యాపారాలలోని వారికి చివరిలో మరింత అనుకూలమనే చెప్పాలి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి పిలుపు రావచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు అన్నింటా అనుకూలత.

కన్య : కొన్ని వ్యవహారాలు విజయవంతం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఇంతకాలం మిమ్మల్ని తేలిగ్గా తీసుకున్న బంధువులు నైపుణ్యత గుర్తిస్తారు. ఆదాయంలో లోటు ఉండదు. వాహనాలు కొంటారు. విద్యార్థులకు విజయాలు. ఇతరులతో మాట్లాడే సందర్భం, ఖర్చు చేసే విషయం, ఆరోగ్యాలపై జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారాల్లో మిశ్రమ ఫలాలు. ఉద్యోగులు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రచయితలకు గౌరవ పురస్కారాలు.

తుల : ఏ కార్యం చేపట్టినా విజయవంతం. ఆప్తులు, శ్రేయో భిలాషులు మీ సలహాలకు విలువ ఇస్తారు. ఆస్తుల పంపకాల్లో ప్రతిష్టంభన తొలగే అవకాశం. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు. అనుకున్న ఆదాయం. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు సంతోషదాయకం. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు.

వృశ్చికం :  ముఖ్య వ్యవహారాలను సొంతంగా పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. బంధువర్గం మీపట్ల ప్రేమానురాగాలు కురిపిస్తారు. ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభించవచ్చు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులకు ఉత్సాహం. రాజకీయవేత్తలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు విజయాల వైపు సాగుతారు.

ధనుస్సు : మిమ్మల్ని మోసగించేందుకు కొందరు యత్నిస్తారు. వాస్తవం గ్రహించి మేల్కొనడంతో బయటపడతారు. ఆలోచనలు కలసిరాక ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి.  వాహనాలు, భవనాలు కొనే యత్నాలు విరమించాలి. రానురాను అనుకూల పరిస్థితులు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాల్లోని వారికి శ్రమకు తగిన ఫలితం. ఉద్యోగులు విధులపై అసంతృప్తి. కళాకారులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆకస్మిక విదేశీ యానం. వారాంతంలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం.

మకరం :  ప్రతి వ్యవహారంలో నిదానం అవసరం. ఆదాయవ్యయాలు సమానం. ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాన్వేషణలో ప్రతిష్టంభన. ఆస్తుల పంపకాలు, కొనుగోలులో మీయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారులకు సామాన్య ఫలితాలు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయవేత్తలు, క్రీడాకారులు సత్తా చాటుకునేందుకు యత్నించి విఫలమవుతారు. ధనలబ్ధి. కొత్త వ్యక్తులతో పరిచయాలు. వారం మధ్యలో మానసిక ప్రశాంతత.

కుంభం : ఇంటికి సంబంధించి వ్యవహారాలన్నీ సజావుగా పూర్తి. సమర్థత, నైపుణ్యత వెలుగులోకి వచ్చే కాలం. కొంతకాలంగా వేధిస్తున్న ఈతిబాధలు తొలగుతాయి. రాబడి పెరుగుతుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా చాటుకుంటారు. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాల్లో సమర్థత చాటుకుంటారు. ఉద్యోగులు సత్తా చూపిస్తారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు.

మీనం : ఎటువంటి లోటు లేకుండా ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. పలుకుబడి, హోదాలు పెరుగుతాయి. సమాజంలో మీకు ఎదురు ఉండదు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. విద్యార్థులకు విజయాలు. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు లభిస్తాయి. వ్యాపారాలు ఆశించినరీతిలో సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలు, క్రీడాకారులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400