వార ఫలాలు ( సౌరమానం) : మార్చి 24 నుంచి 30 వరకు

మేషం : శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. దేవాలయ దర్శనాలు. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. ఇంటిలో కొద్దిపాటి ఒత్తిడులు. కుటుంబ సభ్యులతో వివాదాలు. ఆదాయం కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు లభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారాంతంలో ఆస్తిలాభం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం :  కార్యక్రమాలు సాఫీగా పూర్తి. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. బంధువులతో తగాదాల పరిష్కారం. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. రావలసిన సొమ్ము అందుతుంది. రుణాలు తీరతాయి. ఉద్యోగులు సమర్థత నిరూపించుకుంటారు. వ్యాపారులకు ఆశించిన పెట్టుబడులు అందుతాయి. విస్తరణ యత్నాలు కలసి వస్తాయి. రాజకీయవర్గాలు సత్కారాలతో బిజీగా ఉంటారు.

మిథునం : --కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొన్ని సమస్యలు తీరతాయి. ఆలోచనలకు కార్యరూపం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లబిస్తాయి. కళాకారులకు అవార్డులు, రివార్డులు అందుతాయి.

కర్కాటకం :  కార్యక్రమాలలో చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. సోదరులు, సోదరీల నుంచి మాట పడతారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనాల విషయంలో కొంత మెలకువ అవసరం. రావలసిన సొమ్ము ఆలస్యంగా అందుతుంది. వ్యాపార విస్తరణయత్నాలలో కొంత నిరాశ. పెట్టుబడులలో తొందరవద్దు. ఉద్యోగులకు అసంతృప్తి. రాజకీయవేత్తలకు ఒత్తిడులు వారాంతంలో విందు వినోదాలు. కార్యజయం.

సింహం : -కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులు, స్నేహితులతో అకారణంగా విభేదాలు. మీ కష్టం నిష్ఫలమవుతుంది. నిరుద్యోగులకు నిరాశ. మానసిక అశాంతి. కాంట్రాక్టులు చేజారతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అప్పుల కోసం యత్నిస్తారు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు. వారం మధ్యలో విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం.

కన్య : ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయాల్సిన పరిస్థితి. బంధువర్గంతో అకారణ తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముఖ్యులతో వ్యక్తిగత విషయాలు చర్చిస్తారు. స్నేహితుల నుంచి మాటపడతారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారులకు లాభాలు కనిపించవు. ఉద్యోగులను పనిభారం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళాకారులకు ఒత్తిడులు. అవకాశాలు జారవిడుచుకుంటారు.  వారారంభంలో శుభవార్తలు. వాహనసౌఖ్యం.

తుల : కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి. సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. అరుదైన ఆహ్వానాలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో విజయం. అనుకున్న సొమ్ము అందుతుంది. వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళాకారులకు కొన్ని అవకాశాలు 
దగ్గరగా వచ్చి ఉత్సాహాన్ని ఇస్తాయి.

వృచ్చికం : -చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్నేహితుల నుంచి మాటపడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. కళాకారులకు అవకాశాలు చేజారతాయి. వారం మధ్యలో విందు వినోదాలు. ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి.

ధనస్సు : ఆశ్చర్యం కలిగించే సంఘటనలు. సోదరులు,స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆశయాల సాధనలో బంధువుల సహకారం. భూములు, భవనాలు కొంటారు. దేవాలయాల సందర్శిస్తారు. ఆదాయ విషయంలో ఇబ్బంది ఎదురైనా అవసరాలు తీరతాయి. ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. పదోన్నతులు లభించే సమయం. వ్యాపారులకు స్వయం కృషితో లాభాలు. రాజకీయనేతలు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ కంపెనీలతో అవగాహన.

మకరం :  కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రుణభారాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. వ్యాపారులకు అనుకున్న లాభాలు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించి, సన్మానాలు పొందుతారు.

కుంభం : ----కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగుతాయి. ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు అనుకున్న విధంగా లాభాలు. విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. పదవులు దక్కే అవకాశం.

మీనం : -ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు. సోదరులు, సోదరీలతో కలహాలు. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు. శ్రమకు ఫలితం కనిపించదు. విద్యార్థులు అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారులకు ఆటుపోట్లు, అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు ఊహించని బదిలీలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు తారుమారు. శుభవార్తలు. వారాంతంలో ఆకస్మిక ధనలబ్ధి. వస్తులాభాలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400