వార ఫలాలు : 2024 జనవరి 21 నుంచి 27 వరకు

మేషం : సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చలు జరుపుతారు. మీ భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఎటువంటి కఠిన నిర్ణయమైనా తీసుకునేందుకు వెనుకాడరు. పెద్దల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. ప్రముఖ వ్యక్తులు పరిచయమై సాయపడతారు. ఆదాయం ఆశించినరీతిలో సమకూరుతుంది. వృత్తులు, వ్యాపారాలు మరింత అనుకూలించే సమయం. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఎదురులేని విధంగా ఉంటుంది. వారం మధ్యలో వృథా ఖర్చులు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు.

వృషభం : సమస్యలతోనే గడుపుతారు. ఆదాయానికి కూడా లోటు. అయితే ఖర్చులను అదుపు చేసుకుంటూ కొంత బయటపడతారు. స్వశక్తిపై నమ్మకమే ఆయుధంగా మారనుంది. బాకీలు వసూలవుతాయి. వాహన, కుటుంబ సౌఖ్యాలు. నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వృత్తులు, వ్యాపారాలలో మీ లక్ష్యాలు నెరవేరతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు వస్తాయి. వారాంతంలో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన.


మిథునం : కుటుంబసభ్యులు మీపై  అభాండాలు మోపే యత్నాలు చేస్తారు. కోపతాపాలకు లోనుకావద్దు. పట్టుదలతో పనులు పూర్తి చేసేందుకు యత్నిస్తారు.మీ శ్రమ ఇతరులకు లాభిస్తుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృత్తులు, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు మిశ్రమంగా ఉంటుంది.  వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు.


కర్కాటకం : వ్యయప్రయాసలతోనే గడుస్తుంది. చాకచక్యంగా వ్యవహరించాలి. రాబడి తగ్గి ఇబ్బందిపడతారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో వ్యవహరించాలి. ముఖ్యమైన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయ, వ్యయాల మధ్య పొంతన ఉండదు. రుణాల కోసం చూస్తారు. వృత్తులు, వ్యాపారాలు సమస్యలతోనే కొనసాగవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, న్యాయవాదులు కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. వారం మధ్యలో  ఆకస్మిక ప్రయాణాలు.

సింహం : ఏ పని ప్రారంభించినా విజయమే. ఆస్తుల వ్యవహారాలలో లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్నిస్తాయి.  సమయానికి సొమ్ము సమకూరుతుంది. గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం ఉపకరిస్తుంది. వృత్తులు, వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మరో మెట్టు పైకి ఎదుగుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు సత్తా చాటుకుని అవకాశాలు పొందుతారు. వారాంతంలో మనసు చంచలంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు రావచ్చు.


కన్య : ప్రశాంతంగా జీవనం సాగిస్తారు. మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. విద్యార్థులకు భవిష్యత్తుపై నమ్మకం కలుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు నూతనోత్సాహాన్నిస్తాయి. కుటుంబ సమస్యలను చొరవ తీసుకుని పరిష్కరిస్తారు. రాబడి సంతృప్తికరం. కోర్టు వ్యవహారం కొలిక్కి వస్తుంది. వృత్తులు, వ్యాపారాలు సానుకూల వాతావరణంలో కొనసాగుతాయి. కళాకారులు, పరిశోధకులు, క్రీడాకారులకు కొత్త ఆశలు చిగురించి ఆ దిశగా అడుగులు పడతాయి.

తుల : మీ సహనమే శ్రీరామరక్ష. సమాజంలో విశేష గౌరవ మర్యాదలు. ఆదాయానికి లోటు ఉండదు. ఎడాపెడా సొమ్ములు అందుతాయి. బంధువర్గం నుంచి ఎదురయ్యే సమస్యలను ప్రశాంత వాతావరణలో పరిష్కరించుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వృత్తులు, వ్యాపారాలలో ఆశించిన ప్రగతి కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు నైపుణ్యతను ప్రదర్శిస్తారు. వారాంతంలో స్నేహితుల నుండి సమస్యలు. మీ అంచనాలలో పొరపాట్లు.


వృశ్చికం : అన్నీ విజయాలే. చాలా వరకు  సమస్యలు పరిష్కారం. అందరిలోనూ మీ సత్తా, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.ఒక సమాచారం జీవితాన్ని మలుపు తిప్పే సూచన. సమాజసేవలో భాగస్వాములవుతారు. వాహన, కుటుంబ సౌఖ్యాలు. కార్యక్రమాలను సైతం పూర్తి చేస్తారు.డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. కళాకారులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు చెప్పుకోదగిన అభివృద్ధి.  వారం ప్రారంభంలో దూరప్రయాణాలు.   

ధనుస్సు : ఆదాయానికి, వ్యయానికి మధ్య లోటు ఉన్నా అధిగమిస్తారు. సోదరులు, ఆప్తుల నుంచి ఊహించని సాయం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిళ్లు సహనంతో ఎదుర్కొంటారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వృత్తులు, వ్యాపారాలు మొదట్లో కుంటినడకన సాగినా క్రమేపీ పుంజుకుంటాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, న్యాయవాదులు స్వశక్తితో విజయాలు సాధిస్తారు. వారం మధ్యలో ఖరీదైన వస్తువులు జాగ్రత్త. ధనవ్యయం. 


మకరం : పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఎదుటివారిని మెప్పించి వారి అభిమానం చూరగొంటారు. ఆస్తుల వ్యవహారాలలో కోర్టు కేసులు చాలావరకూ పరిష్కారం. అనుకున్న రాబడి దక్కి రుణబాధల నుంచి కూడా విముక్తి పొందుతారు. గృహం, వాహనాలు కొంటారు. వృత్తులు, వ్యాపారాలలో అనుకున్న అభివృద్ధి. కళాకారులకు అవార్డులు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు  ప్రోత్సాహకరం. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. శారీరక రుగ్మతలు.


కుంభం : ఎవరినీ నొప్పించకుండా నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాటి. విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. ఉన్నతశ్రేణి వారితో పరిచయాలు. రాబడి, వ్యయాల మధ్య సమతూకం పాటించి, రుణాలు చేయకుండా ఉంటారు. వాహనాలు కొనే అవకాశాలున్నాయి. ఆస్తుల వ్యవహారాల్లో సమస్యలు అధిగమిస్తారు. వృత్తులు, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలు సత్తా నిరూపించుకుంటారు.


మీనం : అనుకున్న వ్యవహారాలు ఊపందుకుంటాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువర్గంతో సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు చేరువకు వస్తాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. వృత్తులు, వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి ప్రయోజనం పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు ఒక సంతోషకర సమాచారం రాగలదు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400