మేషం
కార్యక్రమాలు సకాలంలో పూర్తి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆహ్వానాలు అందుకుంటారు. కాంట్రాక్టర్ల యత్నాలలో పురోగతి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కోర్టు వ్యవహారాల్లో పురోగతి. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ఉత్సాహం. పారిశ్రామికవర్గాలకు ఒక సమాచారం ఊరటనిస్తుంది.
వృషభం
అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. యత్నకార్యసిద్ధి. దూరపు బంధువుల మంచీచెడ్డా విచారిస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. వ్యాపారులకు మరింత అనుకూలత ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు ఆహ్వానాలు. క్రీడాకారులు, పరిశోధకులకు ప్రగతిదాయకం.
మిధునం
ఆదాయం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కొంతమేర తీరి ఊరట లభిస్తుంది. విద్యావకాశాలు ఊహించని రీతిలో దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. అందరిలో ప్రత్యేక గుర్తింపు. వ్యాపారులకు విధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. వైద్యులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది.
కర్కాటకం
రాబడి, వ్యయాలు సమానం. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలకు కార్యరూపం. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి సాయపడతారు. పరిస్థితుల ప్రభావంతో కొన్ని నిర్ణయాలు వాయిదా. గౌరవానికి లోటు రాదు. ఆభరణాలు, వాహనాలు కొంటారు. భూవివాదాలు, కేసుల నుంచి బయటపడతారు. వ్యాపా రులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు శుభవార్తలు. కళాకారులు, క్రీడాకారుల యత్నాల్లో కదలికలు.
సింహం
బంధువులతో విభేదాలు సర్దుకుంటాయి. ఆస్తుల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు చేస్తారు. కొన్ని కార్యక్రమాల్లో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలులో స్వల్ప అవాంతరాలు. వ్యాపారులు కొత్త పెట్టుబడుల యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు విధుల్లో గందరగోళంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు కొంత శ్రమించాల్సిన అవసరం ఉంది. కళాకారులు, క్రీడాకారులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.
కన్య
కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభకార్యాల ప్రస్తావనతో సందడి. ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారవచ్చు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీ యవర్గాలకు అనుకూలం. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రీడాకారులు ప్రతిభచాటుకుంటారు.
తుల
నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలకు అనుకూల కాలం. సోదరుల నుంచి పిలుపు రావచ్చు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. రాబడి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత విముక్తి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులకు విధుల్లో గుర్తింపు. రాజకీయవర్గాలకు ప్రోత్సా హకరంగా ఉంటుంది. క్రీడాకారులు, పరిశోధకుల యత్నాలు సఫలం.
వృశ్చికం
కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. ఆశయాలు నెరవేరతాయి. ఆప్తుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు ఇబ్బంది ఉండదు. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. వ్యాపారుల అంచనాలకు తగ్గ లాభాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విశేషంగా కలసి వస్తుంది.
ధనుస్సు
ఆదాయానికి మించిన ఖర్చులు మీదపడతాయి. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో అకారణ విభేదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు బాధ్యతలు మరిన్ని మీదపడతాయి. కళాకారులకు అనుకూల సమయం కాదు. క్రీడాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. వారాంతంలో శుభవార్తలు. వాహనయోగం. ఊహించని ఆహ్వానాలు.
మకరం
ముఖ్య కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కుటుంబసభ్యులు అమిత ప్రేమానురాగాలు చూపుతారు. ప్రముఖులతో చర్చలు సఫలం. విందువినోదాల్లో పాల్గొంటారు. ఆదాయం ఆశాజనకం. వాహనాలు, గృహం కొంటారు. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు మరింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. పరిశోధకులు, కళాకారులకు నూతనోత్సాహం.
కుంభం
ముఖ్య కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని మీ భావాలను పంచుకుంటారు. అదనపు ఆదాయం దక్కి రుణ బాధలు తొలగుతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా గడుస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు అంచనాలు నిజం కాగలవు.
మీనం
ఆదాయం ఆశాజనకం. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. భూ, గృహయోగాలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కోర్టు వివాదాల పరిష్కారం. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు వివాదాలు పరిష్కారం.
వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్: 98852 99400