Beauty Tips : హై హీల్స్ వేసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే నష్టమే..!


ఫ్యాషన్‌గా ఉండాలని ప్రతీ ఒక్క అమ్మాయికీ ఉంటుంది. ఆ ఫ్యాషన్‌కి తగ్గట్టుగానే అందానికి మెరుగులు తిద్దుతారు. వేసుకునే హెయిర్ స్టైల్ నుంచి కాళ్లకు ధరించే చెప్పుల వరకూ అన్నీ పర్ ఫెక్ట్‌గా ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే మోడ్రన్‌గా, మంచి లుక్‌తో ఆకట్టుకోవాలని హై హీల్స్ ధరిస్తూ ఉంటారు. కానీ ఈ హై హీల్స్ ధరించడం వల్ల అనేక సమస్యలు వస్తాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు. హై హీల్స్ కొనే ముందు అమ్మాయిలు ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఎత్తు చెప్పుల్లో ఉండే స్టయిలే వేరు. వేసుకున్న డ్రస్‌ మరింత మోడర్న్‌గా కనిపించాలంటే హైహీల్స్‌ వేసుకోవలసిందే! అయితే వాటి వాడకం పరిమితంగా ఉంటేనే మేలు! లేదంటే పాదాల సమస్యలు భరించక తప్పదు. హైహీల్స్‌తో సమస్యలు: ఎత్తు చెప్పులు వేసుకున్నప్పుడు పాదాల అడుగున వంపు ఎక్కువవుతుంది. దాంతో అక్కడ ఉండే ‘అఖిలిస్‌ టెండాన్స్‌’ ఒత్తిడికి లోనై కుంచించుకుపోతాయి. అంతేకాదు... రెండు అంగుళాల ఎత్తు ఉండే హైహీల్స్‌ వేసుకున్నా, నిలబడినప్పుడు శరీరం ముందుకు వంగిపోతుంది. దాంతో పాదం మొత్తం సమాంతరంగా కాకుండా, ముందరి భాగం, బొటనవేలి మీద శరీర బరువు పడుతుంది.

హైహీల్స్‌ ఎంత తక్కువగా వాడితే అంత మేలు.... ఒకవేళ వేసుకోవలసి వచ్చినా చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే వాటి ప్రభావం తగ్గుతుంది. అవేంటంటే...


ఎక్కువసేపు నిలబడి ఉండాలన్నా, నడవాలన్నా కూడా హైహీల్ ఎత్తు రెండు అంగుళాలు దాటకుండా చూసుకోండి. అలాగే మొదటిసారి ఎత్తు చెప్పు ల్ని ఎంచుకునే వాళ్లు మూడు  అంగుళాల ఎత్తులో ఉన్నవి వేసుకో వద్దు. దానివల్ల కాళ్ల వేళ్లు, పాదాలు, కండరాలు నొప్పిపుడతాయి. మరీ బిగుతుగా, వదులుగా ఉన్న ఎత్తు చెప్పుల్ని వేసుకుంటే ప్రమాదా లు జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎప్పటికప్పుడుకాలు సైజుని బట్టి వాటిని ఎంచుకోవడం మంచిది. ఒకవేళ రోజంతా హై హీల్ వేసుకోవాల్సి వస్తే.. మధ్య మధ్యలో వాటిని విడిచి, పాదాన్ని గుండ్రంగా తిప్పడం, ముందుకు పంచడం. లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. మన శరీర బరువుని మోసేవి పాదాలే. హై హీల్ వేసుకుంటే చూడ్డానికి స్టైలిష్ గా కనిపించొచ్చు. కానీ, ఎత్తు పెరిగే కొద్దీ భారం మడమలపై పడుతుంది. అందువల్ల హై హీల్ రోజూ కాకుండా సందర్భాన్ని బట్టి ఎంచుకోవాలి. 

గర్భిణులు హైహీల్ వేసుకోకపో వడమే మంచిది. అలాగే చిన్నపి ల్లలు కూడా హైహీల్ కి దూరంగా ఉండాలి. అలాగని అసలు వేసుకోవద్దని కాదు. సందర్భాన్ని బట్టి ఎంచు కోవాలి. వీలైనన్ని తక్కువ గంటలు వాటితో ఉండేలా చూసుకుంటే. మంచిది.