Beauty Tips : గోళ్లకు గోరంత అందం ఇలా..

స్ట్రాంగ్ గా, అందంగా గోర్లు పెంచుకోవాలి. అనుకుంటున్నారా! అయితే మీ కోసమే ఈ టిప్స్..

* నిమ్మకాయ ముక్కని గోర్లపై ఐదు నిమిషాలు రబ్ చేసి, వేడి నీళ్లతో కడిగేయాలి. ఇలాచేస్తే బ్యాక్టీరియా పోతుంది. 

* రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెతో గోర్లపై మసాజ్ చేయాలి. ఇలా చేస్తే గోర్లు హెల్దీగా పెరుగుతాయి. 

* గోర్లు పాడై, పొలుసులుగా ఊడుతుంటే ఆలివ్ ఆయిల్ వాడాలి. రోజూ పడుకునే ముందు గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్ ను ఐదు నిమిషాలు గోర్లపై మసాజ్ చేయాలి. 

* నెయిల్ ఆర్ట్, యాక్రిలిక్ నెయిల్స్ చూడ్డానికి అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. కానీ ఇవి గోర్లని బలహీనపరుస్తాయి. 

* ఆకుకూరల్లో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి9 వల్ల గోర్లు బలంగా ఉంటాయి. 

* కోడి గుడ్డు పెంకుల్ని పేస్టులా చేసి గోర్లకి రాయాలి. దానిలో ఉండే క్యాల్షియం వల్ల నెయిల్ గ్రోత్ బాగుంటుంది. 

* రెండు టేబుల్ స్పూన్ ల తేనె, నిమ్మరసం కలిపి గోర్ల మీద మసాజ్ చేసి పావుగంట తరువాత కడిగేయాలి. 

*అరటి పండు, అవకాడోలో ఉండే బయోటిన్ విటమిన్ అయితే గోర్లు, జుట్టు పెరగడానికి ఉప యోగపడుతుంది. అందుకే వీటిని ఎక్కువ తినాలి.