లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అడ్రస్ లేకుండా చేస్తం : మంత్రి కోమటిరెడ్డి

 కేసీఆర్ ను ప్రజలు చీల్చి చండాడారని మంత్రి కోమటిరెడ్డి వెంటకట్ రెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవక ఏడు సీట్లలో డిపాజిట్ కోల్పోయారని విమర్శించారు. ఆ స్థానంలో ఎవరున్నా రాజకీయాలు బంద్ చేసుకొని శాశ్వతంగా రాజకీయాలు విరమించుకోవాలని సూచించారు. ఎనిమిది నెలలు ఇంట్లో రెండుసార్లు అసెంబ్లీ నడిచిన రాలేదన్నారు. 

దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం నిలిచిపోయే విధంగా వ్యవసాయ రంగానికి  రూ. 72 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఏనాడైనా అంత బడ్జెట్ రైతులకు పెట్టావా కేసీఆర్ అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అప్పులను తీర్చుతుంది రాష్ట్ర ప్రభుత్వమని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల పది రోజుల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ లోపు కాల్వల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.  

ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వేందుకు అమెరికా నుండి మిషన్ బేరింగ్ ఆగస్ట్10న వస్తున్నాయని చెప్పారు.  త్వరలోనే సొరంగ నిర్మాణం పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని తెలిపారు.  తెలంగాణకు అన్యాయం చేసేలా కేంద్రం బడ్జెట్ పెడితే ఎందుకు కేసీఆర్ మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనానికి చర్చలు జరుగుతున్నాయని అటువైపు అడుగులు పడుతున్నాయనడానికిదే నిదర్శనమని అన్నారు. రేపు లోకల్ బాడీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఉంటే అడ్రస్ లేకుండా చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.