అవును.. నిజమే.. మా దేశంలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నరు: కెనడా ప్రధాని ట్రూడో

ఒట్టావా: మన దేశం, కెనడా మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక కామెంట్లు చేశారు. తమ దేశంలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నారని ఆయన మొదటిసారి ఒప్పుకున్నారు. ఇటీవల ఒట్టావాలోని పార్లమెంట్ హిల్‎లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కెనడాలో చాలామంది ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నారు. కానీ వాళ్లందరూ సిక్కు సమాజం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కాదు.

 అలాగే కెనడాలో ప్రధాని మోదీ ప్రభుత్వ మద్దతుదారులు కూడా ఉన్నారు. కానీ వాళ్లు హిందూ కెనడియన్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కాదు” అని అన్నారు. కాగా, కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరగడం, ఇందులో ఇండియా హస్తం ఉందని ట్రూడో ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నెలకొంది.