గత కొంత కాలంగా ఓ వాదన వినిపిస్తోంది..జీవనోపాధి దొరకాలన్నా..ఉద్యోగం కావాలన్నా..తప్పనిసరిగా డిగ్రీలు ఉండాలని. ఇది 21 వశతాబ్దంలో పతాక స్థాయికి చేరింది. కంపెనీల యాజమాన్యం, వివిధ సంస్థలు ఇదే పోకడలో ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈ ఆలోచన విధానం మారుతోంది. వ్యాపార ప్రపంచంలోని ప్రముఖులు చాలామంది తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. హ్యూమానిటీస్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకా శాలను అందిపుచ్చుకోవాలం టే డిగ్రీ లు అవసరం అనే దృష్టిని నుంచి ..డిగ్రీలు లేకున్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇటీవల పెన్సిల్వేనియాలోని ఓ యూనివర్సిటీలో మాట్లాడుతూ..ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కళాశాల డిగ్రీలు అవసరం ఉందన్న వాదనను కొట్టిపారేస్తున్నారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను స్పందిస్తూ.. ఇండియన్ టెక్ సీఈవో కూడా X ద్వారా అతని వాదనను సమర్ధించారు.
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇండియన్ టెక్ కంపెనీ జోహో సీఈవో శ్రీధర్ ఇలా అన్నారు. ‘‘చేతిపనులు చేసేవారికి భారత దేశంలో చాలా డిమాండ్, విలువ ఉంది.. ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, వెల్డర్లు, నర్సులతో సహా చేతితో పనులు చేసే వారు అవసరం.. మాకు వస్తు నిర్మాణ వ్యక్తులు కావాలి ’’అన్నారు.
హ్యుమానిటీస్ రంగంలోని విషయాలకు డిగ్రీలు లేదా విద్యావిషయక ఆలోచనల అవసరాన్ని తిరస్కరించారు. మాకు ఎక్కువ ఎకనామిక్స్ లేదా పొలిటికల్ సైన్స్ లేదా హిస్టరీ మేజర్లు అవసరం లేదు. నేను హిస్టరీ, ఫిలాసఫీ ,ఎకనామిక్స్ చదువుతున్నాను, కానీ నేను వాటిలో దేనిలోనైనా డిగ్రీని పొందాలనుకోను అని అన్నారు.
ఏదీ ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో హ్యూమానిటీస్ రంగంలో డిగ్రీలకంటే ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, వెల్డర్లు, నర్సులతో సహా చేతితో పనులు చేసే వారు అవసరం అనేది ప్రముఖ వ్యాపార వేత్తలు ఎలాన్ మస్క్, శ్రీధర్ ల సోషల్ మీడియా పోస్టులతో తేలిపోయింది.