క్రోధి నామ సంవత్సరంలో నర ఘోష, నరదిష్టి నివారణకు మార్గాలు ఇవే

నరఘోష నివారణకు మార్గములు

వ్యక్తులకు, ఇంట్లో కానీ, వ్యాపారస్థలంలో కానీ నరఘోష ప్రభావం ఎక్కువగా ఉంటే, ఉభయ సంధ్యలలోను దీపారాధన చేసి దుర్గాసప్తశ్లోకీ 11 సార్లు పారాయణ చేయుట చాలా  విశేషమైన ఫలితము  ఇస్తుంది. 'ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహయ బ్రహ్మణే పరమాత్మనే' అనే మంత్రము ఉభయసంధ్యలలో 108 సార్లు పారాయణ చేయుట ద్వారా నరఘోష నివారింపబడుతుంది.

నవగ్రహ దానములు

సూర్యగ్రహ శాంతికి గోధుమలు, గోవును, చంద్రగ్రహ శాంతికి బియ్యము, శంఖము, ముత్యము, కుజగ్రహ శాంతికి కందులు, ఎఱ్ఱని వృషభము (కుంపటి), బుధగ్రహ శాంతికి పెసలు, బంగారము, గురుగ్రహ శాంతికి శనగలు, పితాంబరములు లేక ధావళి, శుక్రగ్రహ శాంతికి తెల్లని వస్త్రములు, తెల్ల గుఱ్ఱము, శనిగ్రహ శాంతికి నల్ల నువ్వులు, నల్లని ఆవు, రావుగ్రహ శాంతికి మినుములు, బూడిద రంగు వస్త్రము, మంచి ఖడ్గము, కేతుగ్రహ శాంతికి చిత్ర వస్త్రములు దక్షిణలతో దానము చేయవలెను.