కొన్నాళ్లు బతనీయకండి : పుచ్చకాయ జ్యూస్ తో.. చికెన్ బిర్యానీ వండారు

బిర్యానీ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. చికెన్‌, మటన్‌, ఫిష్‌, మష్రూమ్‌, థమ్‌, వెజిటముల్‌, పన్నీర్‌.. అబ్బో ఒకటేమిటి ఎన్ని రకాలుగా తయారు చేసినా అన్ని రకాల బిర్యానీలను రుచి చూడకుండా ఉండలేరు భోజన ప్రియులు. మీరింత వరకూ రెస్టారెంట్‌ రుచుల నుంచి రోడ్డు పక్కన గల్లీ షాపుల వరకు ఎన్నో రకాల బిర్యానీలు లొట్టలేసుకుంటూ లాగించేసి ఉంటారు. నోట్లో వేసుకోగానే ఇట్టే గుటుక్కున జారిపోయే కమ్మని బిర్యానీ వాసన చూసినా చాలు కడుపు నిండి పోతుంది. కానీ ఈ ఆంటీ చేసిన బిర్యానీ మాత్రం ‘మేము తినలేం బాబోబ్‌..’ అంటున్నారు నెటిజన్లు. తినేందుకేకాదు కనీసం చూసేందుకు కూడా ఎవ్వరూ సాహసించడం లేదు. అదేంటీ అని అనుకుంటున్నారా? మరి ఇది అల్లాటప్ప బిర్యాని కాదుమరీ.. పుచ్చకాయ  బిర్యానీ’. ఇలాంటి బిర్యానీ మేమెప్పుడూ తినలేదే.. కనీసం పేరు కూడా ఎప్పుడూ వినలేదే అని నోరెళ్ల బెడుతున్నారా? . ఈ వీడియో చూశారంటే మీ ఫ్యూజులు కచ్చితంగా ఎగిరిపోతాయ్‌..

వంటచేసే ఇద్దరు వ్యక్తులు పుచ్చకాయను ముక్కలు ముక్కలు గా చేశారు.  వీటిని ఒక పెద్ద పాత్రలో తీసుకుని దానిని రసం వచ్చేలా కలిపారు.   ఆ తరువాత ఈ పుచ్చకాయ రసాన్ని ఫిల్టర్ చేశారు.  ఆ తరువాత కడిగిన చికెన్ ముక్కలను  ఒక పెద్ కళాయిలో తీసుకుని.. నూనె.. మసాలాలే, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టఖ వేసి మసాలాను తయారు చేశారు.రు.  మసాలాను చికెన్ ముక్కలకు జోడించి.. అందులో పుచ్చకాయ రసాన్ని  కలిపారు.   ఆ తరువాత చికెన్ ముక్కలను ఉడికించి..  అందులో బిర్యానీ రైస్ కలిపారు.  ఈ పదార్థాలన్నీ కలిపి రకరకాల మసాలా దినుసులు వేసి చికెన్‌ని కాస్త వండుకున్నారు. 

వాటర్ మిలాన్ బిర్యానీ వీడియో ఇన్‌స్టాగ్రామ్ పేజీ @villagefoodchannel_official  పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. ఇప్పటివరకు ( వార్త రాసేవరకు) ఈ వీడియోకు 400K లైక్‌లు..81 లక్షలకు పైగా వీక్షణలను పొందింది. దీనిపై నెటిజన్లు స్పందించి పలువురు కామెంట్ చేశారు.  మంచిగా తయారైన పుచ్చకాయను వేస్ట్ చేశారని ఒకరు కామెంట్ చేయగా.. ఇంకొకరు ఆహారాన్ని శక్తి కోసం వినియోగించుకోవడానికి కోల్పోతున్నామని రాశారు. ఈ వీడియోకు వచ్చిన  కామెంట్లను పరిశీలిస్తే పుచ్చకాయతో బిర్యానీ చేయడం కంటే విడిగా తినవచ్చని ఒకరు రాయగా... చికెన్ పై పుచ్చకాయ రసం పోసే వరకు బాగానే ఉంది కాని.. ఇలా బిర్యానీని చేయడం నచ్చలేదని రాశారు. మరొకరు గొప్ప వంటకమైన బిర్యానీని పాడుచేయకండి అని పోస్ట్ చేశారు.   కొంతమంది  చాలా రుచికరమైన బిర్యానీనా అని అడిగారు.. కొందరు టేస్ట్ చేయాలనుకుంటున్నారనగా... మరికొందరు ఎప్పటికి రుచి చూడకూడదు అని రాసుకొచ్చారు.  ఇంకో వ్యక్తి ఈ వంటకం తిన్న తరువాత అంబులెన్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందేమో అని రాశారు. 

అవును మరి..ఫుడ్ బిజినెస్ లో రోజు రోజుకు పోటీ పెరుగుతున్న వేళ ఏదోక వెరైటీని చూపించాల్సిందే. వ్యాపారంలో నిలబడాలంటే పేరన్నా వెరైటీగా ఉండాలి..టేస్ట్ అయినా వెరైటీగా ఉండాలి. ఏం చేసినా..ఎలా చేసినా వెరైటీ అనేది మస్ట్. అటువంటి వెరైటీ ఈ పుచ్చకాయ బిర్యానీ  పేరు వింటే ఏదోలా ఉంది కదా..