ఎండుతున్న పంటలు.. ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు


వరద కాలువలో నీళ్లు లేకపోవడంతో పంట పొలాలు ఎండుతున్నాయి. ఇప్పటికే వరి నార్లు పోయగా వాటిని కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌‌ గ్రామంలో సాగునీరు లేకపోవడంతో కొన్నేండ్లుగా నాలుగు కిలోమీటర్ల దూరంలోని వరద కాలువ నుంచి పైప్‌లైన్లు వేసి సాగు చేసుకుంటున్నారు. ఈగ్రామంలో సుమారు 2వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈసారి వానలు లేకపోవడంతో వరద కాలువలో నీరు లేదు. దీంతో రైతులు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకొని వరి నార్లను కాపాడుకుంటున్నారు.- 
మెట్‌పల్లి, వెలుగు