లింగంపేట పీహెచ్​సీలో నీటి కొరత

  •     ఇబ్బందులు పడుతున్న రోగులు, సిబ్బంది

లింగంపేట,వెలుగు : లింగంపేట పీహెచ్​సీలో పదిహేను రోజులుగా నీటి కొరత ఏర్పడింది. దీంతో హాస్పిటల్​కు వచ్చిపోయే రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో నిత్యం పదుల సంఖ్యలో రోగులు హాస్పిటల్​కు వస్తుంటారు. వీరితో పాటు గర్భిణులు, డెలివరీ అయిన మహిళలు కూడా ఉంటారు. నీటి కొరతతో బాత్​రూమ్​ వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నామని వారు వాపోతున్నారు.

ఏడాది కింద హాస్పిటల్​లో వాటర్​పైప్​లైన్ కు మరమ్మతులు చేయించారు. కానీ నామ్​కే వాస్తే పనులతో కొద్దిరోజులకే పైప్​లైన్ ​విరిగి, సమస్య ఏర్పడుతోంది. హాస్పిటల్ ​డాక్టర్ ​హిమబిందును ప్రశ్నించగా, నీటి కొరత ఉన్న మాట వాస్తవమేనని

కోతులు తరచుగా పైపులు విరగొడుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని  చెప్పారు. ఇదివరకే రూ.20 వేల సొంత డబ్బులు ఖర్చుచేసి నీటిసరఫరాను పునరుద్ధరించినట్లు చెప్పారు. రెండుమూడు రోజుల్లో పైప్​లైన్ ​బాగు చేయిస్తామన్నారు.