నాగార్జున సాగర్ సాగర్ 10 గేట్లు ఎత్తివేత

హాలియా, వెలుగు: ఎగువన శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌‌ రిజర్వాయర్‎కు వరద వస్తుండడంతో ప్రాజెక్ట్​ అధికారులు 10 గేట్లను 5 ఫీట్లు పైకెత్తి.. 80,900  క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి1,24,943  క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువకు1,24,943 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గురువారం సాయంత్రం 6  గంటల వరకు సాగర్‌‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312 టీఎంసీ)లకు 589. 90 అడుగులు(311.7462 క్యూసెక్కులు) చేరింది.  ప్రాజెక్ట్ కుడి కాల్వ ద్వారా 9,387, ఎడమ కాల్వ ద్వారా3,146 , విద్యుత్​ఉత్పత్తికి 29,110, ఎస్‌‌ఎల్‌‌బీసీకి1800, వరదకాల్వకు 600 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.