స్వల్పంగా పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం

బాల్కొండ,వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టు నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది.ఆదివారం ప్రాజెక్టులోకి 3762 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1091.00అడుగులు(80.50టీఎంసీలు)కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులో1059.60 అడుగులు,(10.18టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఈ ఖరీఫ్ సీజన్ లో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా ఇప్పటివరకు 3.87 టీఎంసీల నీరు వచ్చి చేరిందని అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి.1.20 టీఎంసీల నీరు మిషన్ భగీరథ, ఆవిరి రూపంలో వెళ్లింది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1064.90 అడుగులు,(15.88 టీఎంసీల )నీరు ఉంది.