ఓరుగల్లు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు..  బాడీ వార్న్‌‌‌‌‌‌‌‌కెమెరాలు : న్యూసెన్స్‌‌‌‌‌‌‌‌ చేసే వారి ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం

వరంగల్, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పోలీసులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తర్వాత అతి పెద్దదైన గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ సిటీలో బాడీ వార్న్‌‌‌‌‌‌‌‌ కెమెరాలను వాడుతున్నారు. ట్రైసిటీ పరిధిలో పనిచేసే ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ పోలీసులు తమ షర్ట్‌‌‌‌‌‌‌‌కు ఈ కెమెరాలను ధరించి డ్యూటీలు చేస్తున్నారు. రోడ్లమీద న్యూసెన్స్‌‌‌‌‌‌‌‌ చేసే వారిని ఈ కెమెరాలతో ఫొటోలు తీయడంతో పాటు వీడియో రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. దీని వల్ల సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించి పలు కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చూడటంలో సక్సెస్‌‌‌‌‌‌‌‌ అవుతున్నారు.

11 లక్షల జనాభా.. 3 ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్లు

గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లు ఉన్నాయి. 407.71 చదరపు కిలోమీటర్ల గ్రేటర్‌‌‌‌‌‌‌‌ పరిధిలో 11 లక్షల జనాభా నివసిస్తున్నారు. గత ఐదారేండ్లుగా వరంగల్‌‌‌‌‌‌‌‌ నగరం వేగంగా విస్తరిస్తుండగా, వందలాది కాలేజీలు ఉండడంతో నగరంలోని రోడ్లన్నీ నిత్యం ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌తో రద్దీగా మారుతున్నాయి. ఒక్కో స్టేషన్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ఏడెనిమిది కిలోమీటర్ల దూరం డ్యూటీలు చేస్తున్నారు. దీనికి తోడు నగరంలో నిత్యం ఏదో ఒక చోట ధర్నాలు, నిరసనలు జరుగుతుండడంతో గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ విభాగంలో పనిచేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.

డ్రంక్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ తనిఖీల్లో...

గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ పరిధిలో మందుబాబులు, ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. గతంలో పీకలదాక తాగిన కొందరు డ్యూటీలో ఉన్న పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. ఇష్యూ కోర్టుకు చేరిన టైంలో పోలీసులే తమ పట్ల కఠినంగా వ్యవహరించారని చెబుతుండడంతో కేసులు వీగిపోతున్నాయి. దీంతో పలు జంక్షన్లలో డ్రంక్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ తనిఖీలు చేపట్టే ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు బాడీ వార్న్‌‌‌‌‌‌‌‌ కెమెరాలను అందించారు. దీంతో వాహనదారులు, పోలీసులకు మధ్య జరిగిన సంభాషణ వీడియో రూపంలో రికార్డ్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. అలాగే నగరంలో ధర్నాలు, నిరసనలు జరిగే చోట సైతం ఇలాంటి కెమెరాలను వినియోగించి లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌కు విఘాతం కలిగించే వారిపై చర్యలు చేపట్టేందుకు ఈ వీడియోలను ఆధారాలుగా సమర్పించనున్నారు.

ముందుగా ఎస్సై స్థాయి ఆఫీసర్లకు..

ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ ఎవిడెన్స్‌‌‌‌‌‌‌‌గా కోర్టులో శిక్షలు పడేందుకు ఉపయోగపడే బాడీ వార్న్‌‌‌‌‌‌‌‌ కెమెరాలను ముందుగా సీఐ, ఎస్సై స్థాయి ఆఫీసర్లకు అందించారు. నగరంలోని రోడ్లపై ఇప్పటికే 250 సీసీ కెమెరాలు ఉండగా.. ఇప్పుడు ఆఫీసర్ల షర్ట్‌‌‌‌‌‌‌‌కు ఉండే బాడీవార్న్‌‌‌‌‌‌‌‌ కెమెరాలు పోలీస్‌‌‌‌‌‌‌‌ శాఖకు మరింత హెల్ప్‌‌‌‌‌‌‌‌ అవుతాయని భావిస్తున్నారు. 32 జీబీ స్పేస్‌‌‌‌‌‌‌‌తో 4 సెంటిమీటర్ల స్క్రీన్‌‌‌‌‌‌‌‌ కలిగిన కెమెరాలను పోలీస్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌రూంకు అనుసంధానం చేయడం వల్ల సాక్ష్యాధారాలను బలంగా చూపేందుకు పోలీసులకు అవకాశం లభించింది.

ట్రాన్స్‌‌పరెంట్‌‌ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌ కోసమే...

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పరెంట్‌‌‌‌‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌ కోసం బాడీవార్న్‌‌‌‌‌‌‌‌ కెమెరాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. కొన్ని సమయాల్లో వాహనదారులు పోలీస్‌‌‌‌‌‌‌‌ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. ధర్నాలు, నిరసనలు జరిగే చోట్ల కొందరు లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌కు విఘాతం కలిగించి.. పోలీసుల తీరే తప్పన్నట్లుగా వాదిస్తుంటారు. బాడీ వార్న్‌‌‌‌‌‌‌‌ కెమెరాల్లో వాయిస్, ఫొటోలు, వీడియో రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశం ఉండడంతో ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో జరిగిదేంటో ఈజీగా తెలిసిపోతుంది. ఈ కెమెరాల వల్ల ఆకతాయిల్లో భయం కలగడమే కాకుండా, పోలీస్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది కూడా ఎదుటివారితో ఎలా మాట్లాడుతున్నారు ? ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవచ్చు.-సత్యనారాయణ, వరంగల్‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ ఏసీపీ